మాటల మంత్రదండంlllమోటూరి నారాయణ రావు

మాటల మంత్రదండంlllమోటూరి నారాయణ రావు


మాటల మంత్రదండం

అరచేతిలో  మంత్రదండం 
గింగిరాలు తిప్పే బొంగరం 
ప్రపంచాన్ని ఏలేస్తున్న చిరుయంత్రం
విశ్వమంతటినీ చిన్నది 
చేసిన గడుసైన శబ్ధతరంగిణి

పసిపిల్లలకు  చందమామైంది 
పెద్దలకు చేతిలో  జీవితమైంది
కడుపుకు తిండి, కంటికి నిద్ర 
దూరమవుతున్నా.. తలవాకిట
చరవాణి కనిపించకుంటే అంతా అయోమయమే 

రింగురింగుకు ఎదలో సడి
కాల్ దూసిన  చురకత్తి 
కాలాన్ని, విత్తాన్ని 
హరించే వీరవిహారిణి 
మనిషిని నిలువెల్లా బానిస
చేసిన నీలవేణి చరవాణి 


తెలియని వారిని
పరిచయం చేసే నేస్తం 
తెలిసిన వారిని 
దూరం చేస్తున్న  శత్రువు 
మనిషికి మనిషికి మద్య 
అంతరాలు పెంచేస్తున్న 
కలియుగ  కలి పురుషుడు.


రచన : మోటూరి నారాయణ రావు 
వృత్తి : జర్నలిస్టు 
ప్రాంతం: హైదరాబాద్ 
చరవాణి : 9346250304

0/Post a Comment/Comments