చిటపట చినుకులు
శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
ఆకాశవీధిలో
ఆషాడ మాసాన
కురిసేటి మేఘమా
నీ చిరునవ్వుల చినుకులలో
తడిసి మురిసాము
వాన చినుకులా అవి
అమృత జలకాలు
సేద్యానికి చిరుజల్లులు
రైతుల పాలిట ముత్యాల వెల్లువలు
పాడిపంటలకు తేనెచినుకులు
ఆషాడ పు అల్లుళ్ళ అలకలు
కోడళ్ల కోపతాపాలు
అరచేతి గోరింట గుబాళింపులు
వెరచి చిటపట చినుకులు
బోనాల ఊరేగింపు లు
అమ్మవారి జాతర లు
శాకంబరి దర్శనాలు
వాన జల్లుల పులకరింత లు
తడిసిన మేని తుళ్ళింతలు
సుధా మధుర ధారలు
మకరంద మధుబాలలు
వర్షానికి హర్షం కాని వారెవరు
కౌరవుల కలానికి సిరా చినుకులు
వాన కోయిల రాగాల పలుకులు
వృద్ధులకే క్రతువు ఋతువు
చిటపట చినుకులలో చిందులు వేసే చిన్నారులు.. కాగితపు పడవల ప్రయాణాలు
జనానికి జగానికి వాన చినుకుల క్రతువులు ఎన్నెన్నో
వందనం అభివందనం బంగారు పంటలు పండించే వానచినుకు లకు శతకోటి వందనాలు.