శుభప్రదాయకం
పిల్లి.హజరత్తయ్య
ఊరు: శింగరాయకొండ
చరవాణీ: 9848606573
శుభకార్యములకు శోభనొసగి
శుభలగ్నం నందు అక్షింతలై
వధూవరులకు మంగళప్రదాయకమై
బంధువులమోములో ఆనందపుహరివిల్లై
మెరిసే సప్తవర్ణాల శోభితము..!
ముత్తైదువతనానికి నిదర్శనమై
దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమై
దుష్టుల పాలిట సింహస్వప్నమై
ఆశావాద జీవితానికి సంకేతమై
వెల్లవిరిసే శుభప్రదాయకము..!
సృజనాత్మక ఆలోచనలకు మూలమై
మానసిక సామర్థ్యానికి ఆలంబనయై
శనిగ్రహాన్ని పోలిన వర్ణమై
మనిషి దృష్టిని ఇట్టే కట్టిపడేసే
ముగ్ధ మనోహర వర్ణము..!
ప్రమాదాల నివారిణియై
ఆరోగ్య ప్రదాయనియై
ఇంటిల్లపాదికి మంగళకరమై
ఆడపడుచులకు ఆశీర్వాదమై నిలిచే
పసిడివర్ణమే పసుపు వర్ణము..!