మారాలి మనసుlllడా|| బాలాజీ దీక్షితులు పి.వి

మారాలి మనసుlllడా|| బాలాజీ దీక్షితులు పి.వి


మారాలి మనసు

చిరునవ్వు మొఖాన పులుముకొని
బాధలన్నింటినీ 
సంచిలో నింపుకొని
కన్నీరుని పన్నీరుగా మార్చుకొని
మూగబోయిన గొంతుక నిండా 
కొత్తరాగాలందుకొని 
అన్ని బాధలు తనవిగా 
ఆకలి తీర్చగ -ఆశల సంద్రంలో
శ్రమించి   చమటోడ్చి  పెంచి  పెద్ద చేసి 
రెక్కలు వచ్చినా 
రెప్పలు మూయక కాపాడుతూ
లాలించి పాలించిన 
తల్లి తండ్రులను ఏటికి వదిలేసి
దిమ్మరులై, అత్యాశా బానిసలై 
యాంత్రిక ముసుగుతో 
చీకటి నింపుకుంటున్న 
నవతర మేధావులారా
మారాలి మనసు

రచన
డా|| బాలాజీ  దీక్షితులు పి.వి
తిరుపతి

0/Post a Comment/Comments