భారతంలో భీష్ముడుllllడా విడి రాజగోపాల్

భారతంలో భీష్ముడుllllడా విడి రాజగోపాల్

భారతంలో భీష్ముడు

మహాభారతం   మలుపులతో సాగే ఓ సెలయేరు
ఆసెలయేరు పటిష్టంగా తయారైంది
మన భరతుని రాజ్యవిస్తరణతో,
ఆ భరతుడే కణ్వాశ్రమాన పెరిగిన సింహం    
శకుంతల దుష్యంతుల తనయుడు 
విశ్వామిత్ర మేనకల మనువడు

తొమ్మండుగురు కుమరులు ఆ భరతునికి
కానీ అందరూ అయోగ్యులే   
అయోగ్యులపై రాజ్యభారమా అని
తన కుమారులను కాదని
ఓ యోగ్యుని వారసుడుగా  
ప్రకటించటం ఓ విశేషం చక్కని ఆదర్శం
శకుంతల ఈ విషయంలో చింతిస్తుంది
అమ్మా మనవుత్రులు యోగ్యులు కాదు
అందుకే ఈ నిర్ణయం అని తల్లికి చెబుతారు
రాజు అంటే అలా ఉండాలి!

అలా తరాలు మారి మారి
ప్రతీపుడు అవుతాడు ఆసామ్రాజ్యాధినేత 
ఇదే సమయాన 
దేవలోకంలో   బ్రహ్మ కొలువు సాగుతుంది
అనుకోనిరీతిన ఓ సుడిగాలి అందుచేరి
బ్రహ్మపుత్రి గంగమ్మ పమిట చెదరె   
సభాసదులెల్ల  కళ్ళుమూసుకొనిరి 
మహాభీషుడు అనబడే రాజర్షి 
నిగ్రహం కోల్పోయాడు 
ఎదురుగా ఓ ముగ్దమనోహర సౌందర్యం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు 
గంగమ్మ కూడ ఆకర్షణకు లోనైంది 
బ్రహ్మ కోపానికి  గురౌతారు ఇరువురు 
ఫలితం భూలోకంలో జనించమని శాపం
మహభీషుడు కురువంశీయుడు
ప్రతీప చక్రవర్తి కుమరునిగా జన్మించి యక్తవయస్కుడవుతాడు శంతనుడుగా

ఇక గంగాదేవి భూలోకం  వెల్తుంటే
ఇదే సమయాన
ఓ దేవతావసువులు భూలోకాన విహరిస్తూ ఓ  కామధేనువుపై ముచ్చట పడతారు
అది వశిష్ఠమహర్షి ఆశ్రమమని ఎరుగరు
ఏకంగా దానిని తమవెంట తీసుకవెళ్ళటం
ఆ మహర్షి  ఆ అసువులనెల్ల 
భూలోకంలో జనించమని శాపించటం
వశిష్ఠుడిని ప్రాధేయపడగా 
అందు ఏడుగురికి పుట్టినకొద్దిఘడియల్లో 
శాపవిముక్తులవుతారని వరమివ్వటం
విచారవదనంతో ఆ వసువులు 
అటుగా వెళ్ళే గంగమ్మ ను ఆశ్రయిస్తారు
అమ్మా భూలోకంలో నీ బిడ్డలవుతామని
గంగమ్మ ను ప్రాధేయపడటం జరుగుతుంది
గంగమ్మ జాలి పడి ఆమోదిస్తుంది
వారిని పుట్టంగనే గంగలో వేయమంటారు
పురిటికందులను చంపటం ఎంత బాధాకరం
గంగమ్మ సందేహంలో పడగా
అమ్మా మేము శాపవిముక్తులమవుతాం
సందేహించకు
అష్టమగర్భాన పుట్టే బిడ్డ ప్రశాంతుడని
తమ అంశంలో కొంత తీసుకొని
ఆ బిడ్డ దీర్ఘాయుష్మంతుడవుతాడని
కారణజన్ముడౌతాడని చెప్పగా 
అందుకు సమ్మతిస్తుంది గంగమ్మ

అలా భూలోకానికి వచ్చింది గంగమ్మ  శాంతనుని కంటపడింది
ఆమె అందచందాలకు ఆకర్షితుడాయె   
వివాహమాడమని కోరే ఆ రాజు
అయితే గంగమ్మ సందేహంగా చూస్తుంది రాజువైపు
ఓ రాజా నీకోర్కెతీర్చగలను..కానీ 
నేను చేసె కొన్ని పనులు ఎందుకు ఏమిటి అని  అడగవలదు 
ఒకవేళ అలాచేస్తే   ఆ క్షణమే మనకు ఎడబాటు తప్పదని చెబుతుంది
ఆకర్షణలో పడ్డ రాజు తలూపె షరతులకు 

గంగమ్మ తమకు పుట్టిన ఏడుగురు పసికందులను గంగపాలు చేయటం
శంతనుడు నిస్సహాయతతో మదనపడటం
ఇక అష్టమసంతానం కనగానె
సహనం కోల్పోయి  చిన్నారులనెందుకు నీటిపాలు చేస్తున్నానని ప్రశ్నించటం
గంగమ్మ తన పుత్రునితో వెళ్ళిపోతూ
తన జన్మరహస్యం  ఆ ఏడుగురు బిడ్డల జన్మరహస్యం చెబుతంది
కనీసం ఈ బాలుడినైన ఇవ్వమనగా
రాజా అలాగే ఇచ్చెద
ఈ బాలునికి విద్యాబుద్దులు నేర్పించి
అంటూ వెడలె గంగమ్మ ఆ బాలునితో
వశిష్ఠుడు బృహస్పతి పరశురాముడు వంటి మేటిగురువుల వద్ద  విద్య నేర్పి
ప్రభాసుడని పేరున యవ్వనవంతునిజేసె

ఓ రోజు శాంతనువుడు వేటకైవచ్చి
గంగానది ప్రవాహాన్నితన బాణాలతో ఆపివేసిన యవ్వనున్ని జూసి నాయనా ఎవరు నీవు అనివిచారించుచుండ
అప్పుడు గంగమ్మ వచ్చి 
కుమారుని  తండ్రికి పరిచయం చెసె
శాంతనుడు ఆనందాతిశయంతో
గాంగేయునీ అక్కునజేర్చుకొని  యవ్వనపట్టాభిశక్తునిజేసె

శాంతనుడు ఓరోజు గంగ ఒడ్డుకు చేరటం
ఓ అందాలరాశి సత్యవతి కంట పడటం
పరస్పర ఆకర్షణ కు లోనవడం
సత్యవతి తల్లిదండ్రులతో సంప్రదించి
సత్యవతిని ఇవ్వమనడం
ఆశపడ్డ దాశరాజు దంపతులు
సత్యవతి సంతానం రాజవారసులవ్వాలనికోరడం
శాంతనువుడు అంగీకరించక వెనుదిరగడం

ప్రభాసునికి తెలిసె ఈ విషయం  
వెడలె బెస్తరాజు చెంతకు
వారి సందేహం నివృత్తి చేసె
తాను ఆజన్మ బ్రహ్మచర్యం స్వీకరించి
సత్యవతి పుత్రులకే  పట్టంకట్టెదననియె
ప్రతినబూనె ప్రభాసుడు
సత్యవతిని  శాంతనవుని ఇల్లాలినిచేసె
తాను బ్రహ్మచారియై తండ్రికోర్కెతీర్చె 
గంగమ్మ ప్రత్యక్ష మై అభినందించె
నారదుడు భీషణ ప్రతిజ్ఞ చేసిన
ప్రభాసుని భీష్ముడు అని నామధేయునిజేసె

అన్నమాట ప్రకారం సత్యవతి సంతానం
చిత్రాంగదునికి పట్టాభిషేకం
చిత్రాంగదుడు గాంధర్వులతో యుద్ధంలో
మరణించటం
విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేయడం
ఆపై విచిత్రవీర్యునికి వివాహ ప్రయత్నం
స్వయంవరాన అంబ అంబికా అంబాలిక
అను మువ్వురందగత్తెలను  తేవటం
అంబ  ప్రేమ వ్యవహారం తెలిసి
ఆమెను త్రిప్పి పంపిన చరితాత్ముడు 
ఈ భీష్ముడు

అయితే అంబ విషయంలో 
ఆమె  ప్రేమ బంధం తెగి పోవటం
భీష్ముని వివాహమాడమని కోరడం
భీష్ముడు తిరస్కరిస్తే 
పరశురాముని ఆశ్రయించటం అంబనుమనువాడమని ఆగురు బోధ
భీష్ముడు తాను ప్రతిజ్ఞా బద్ధుడనని
తిరస్కరించి గురువుతో యుద్ధం
పరశురాముడు భీష్మ దీక్షకు తలవంచటం

పట్టు వదలని అంబ ఘోరతపస్సుచే
పరమశివుని మెప్పు పొంది
మరుజన్మలో శిఖండిగా జన్మించి
భారత యుద్ధంలో భీష్మునిపై 
పగతీర్చుకొనే వరం పొందడం 
భీష్ముని జీవితంలో పెద్ద మలుపు

మరోవైపు అంబిక అంబాలికలకు విచిత్రవీర్యునితో వివాహం జరిపించడం
విచిత్రవీర్యుని హఠాన్మరణం 
వంశం అంతరించునని భీష్ముని
పెళ్ళాడమని వేడుకుంటుంది సత్యవతి
ససేమిరా అంటాడు భీష్ముడు
అయితే సత్యవతి వ్యాసుని ఆశ్రయించడం
వ్యాసునిచే అంబాలిక  అంబికలకు ధృతరాష్ట్రుడు పాండురాజు జననం 
భీష్ముడు తనబలంతో  గాంధార రాజును ఒప్పించి   గాంధారిని ధృతరాష్త్రునికి 
వివాహం చేయడం
కుంతిభోజుని  తనయ కుంతిని పాండురాజుకు  కట్టబెట్టడం
అంధుడు కనుక పాండురాజు రాజవ్వటం
పాండవుల జననం
ఆఫై  మునిశాప ఫలితంగా పాండురాజు  మరణం
విధిలేక ధృతరాష్ట్రుడు రాజవ్వడం
కౌరవుల జననం
అక్కడనుండి కుటిలత్వం 
ధృతరాష్త్రుని పుత్రకాంక్షతో 
పాండవులకు ద్రోహం తలపెట్టడం
ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుని రంగప్రవేశం
పాండవులకు  అండగా నుండడం
దుర్యోధనుని రంగప్రవేశంతో 
కుట్రలు కుతంత్రాలతో   సాగె భారతం
ఓ దుర్మార్గునికి మరో దుర్మార్గుడు 
శకుని రూపంలో తోడవటం

భీష్ముని సలహాలు పెడచెవిన పెట్టి
ధృతరాష్త్రుడు దుర్యోధనునికి వత్తాసు పలకడం
పాండవులను మాయాజూదంతో అడవిపాలు చేయడం
పాండవుల పట్టమహిషి ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపహరణ
ఇవన్నీ భీష్ముడు నివారించకపోవడం 
జీవచ్ఛవంలా సాగుతుంది భీష్ముని 
చివరి అంకం
కురుక్షేత్ర సంగ్రామం నివారించలేడు
యుద్ధంలో రెచ్చిపోతాడు
చివరకు ఇచ్ఛామరణం కోరుకుంటూ
పథకం ప్రకారం శిఖండిని ముందుంచి
అదునుజూసి  ఈ వీరుని  అంతమొందిచటం
ఆవిధంగా పాండవులకు మేలుచేయటం
భీష్ముడు పరోక్షంగా ధర్మయుద్ధాన్ని గెలిపించిన 
సమస్త శాస్త్ర పారంగతుడు
అంపశయ్య పై ఆరుమాసాలు 
అంపశయ్య పై ఉన్న ఈ యోధుడు ధర్మజునికే ధర్మ సూత్రాలు చెబుతాడు
ద్రౌపది వేసిన చిక్కు ప్రశ్నకు
అవును ద్రౌపతి! నా దేహం దుర్యోధనుని ఉప్పు తిన్నది, 
నా ఆధీనంలో లేదని తెలుసు 
నీకు అవమానం జరుగుతుండగా
 నా దేహం నా మాట వినలేదు
అంతటి ఘోర పాపం చేసాను కనక
ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను
అని చెప్పిన మహనీయుడు

భారతం మూలస్తంభం
మచ్చలేని మణిదీపం
అస్త్రంచేత ఉంటే ధీటురారెవ్వరు వీరికి
అయితే అధర్మం కూటమిలో చిక్కి
పంజరంలో చిలకవలె స్వేచ్ఛ లేక 

ధర్మానికి కట్టుబడ్డా
అధర్మం వెన్నంటి ఉన్నాడు
గంజాయి వనంలో ఓ తులసి మొక్క లా!

ఉత్తరాయణ పుణ్యకాలాన
తానుకోరుకున్న
ఆశ్వీయుజ  ఏకాదశినాడు నాడు 
తనువు చాలించిన
చరితార్థుడు మన భీష్ముడు

డా విడి రాజగోపాల్
9505690690


0/Post a Comment/Comments