నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడువచ్చేది తల్లిదండ్రుల ప్రేమ ఒక్కటే.
ఎన్ని యూగాలు మారిన ఎన్నితరాలు దాటినా
మారని మాధుర్యం
తల్లిదండ్రుల ప్రేమ ఒక్కటే!
ఏ దేశమేగిన ఎన్ని ఏ తీరం దాటినా
మరువని మమకారం తల్లిదండ్రుల ప్రేమ ఒక్కటే.
తల్లిదండ్రులను దూరం చేసుకోకండి.
వారిప్రేమను మర్చిపోకండి.
మమకారానుబంధాలను తెంచుకోకూడదు.
ఒక్కొక్క రూపాయి పోగుచేసి కట్టుకున్న
అందాలమేడా ఒక్కసారిగా కూలిపోతే ఎంత క్షోభ అనుభవిస్తావో ,నీవు వారిని వదిలి వెళ్ళిపోతే అంతకన్నా వెయ్యిరెట్లు వారు క్షోభను అనుభవిస్తారు.
తల్లిదండ్రులను వదిలివెళ్ళకండి.
అవసరానికి వెళ్లిన వాళ్ళను వదలకూడదు.
పుట్టినప్పడినుండి నీకాళ్ళమీద నిలబడేవరకు
వాళ్ళు చేసే త్యాగాలను గుర్తించాలి.
వాళ్ళు అనుభవించే వేదనను అర్థంచేసుకోవాలి.
ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే నీవేంత వేదనననుభవించావో అరవై ఏళ్ల వయసులో నీవులేకపోతే అంతే వేదన, బాధ అనుభవిస్తారు.
తల్లితండ్రులను పూజిస్తే ఏ గుడి మెట్టు ఎక్కి మోక్షం పొందనవసరంలేదు.తల్లిదండ్రుల దీవెనే మనకు భిక్ష, రక్ష.
దేవుడు ఊపిరి పోస్తే తల్లిదండ్రులు జీవితాన్నే ఇస్తారు.
ఎవరికైనా ఉపకారంచేయాలంటే
ముందుగా తల్లికి
ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందుగా తండ్రికి ఇవ్వాలి.
అప్పుడే జన్మకు సార్ధకత లభిస్తుంది..
వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా.
ప్రక్రియ :వచనం.