పంచభూతాలే పంచ ప్రాణాలుlllllకల్పన దేవసానిlllllకామారెడ్డి

పంచభూతాలే పంచ ప్రాణాలుlllllకల్పన దేవసానిlllllకామారెడ్డి

పంచభూతాలే పంచ ప్రాణాలు

ఆకాశహర్మ్యాలు పెంచేసి ఖనిజాలను తవ్వేసి భూమాతను హింసిస్తూ మన ఆయుష్షు 
మనమే తగ్గించుకుంటున్నాము.. 

జలధార కోసం పుడమి తల్లిని కుళ్లబొడిచి రంధ్రాలు చేసి మన తనువులో నీరు 
లేకుండా చేసుకుంటున్నాము...

అవసరానికంటే ఎక్కువ విద్యుచ్ఛక్తి/ ఇంధనాన్ని ఉపయోగించి మన జీవితాలకే మనం మంట పెట్టుకుంటున్నాం...

భయంకర రసాయనాల/వాహనాల పొగలను నింపి జీవనాధారమైన ప్రాణవాయువు కోసం 
నేడు అల్లాడుతున్నాం...

రకరకాల కాలుష్యాలతో ఓజోన్ పొరను నశింపజేసి ప్రకృతి విలయతాండవాన్ని 
ఆకాశానికి నిచ్చెన వేసి భూమికి ఆహ్వానిస్తున్నాము...

అభివృద్ధి అనేది ఆనందంగా ఉండాలి కానీ అగాధాలలోకి తోసేయకూడదు,  
కనుక ..
*పంచభూతాలను పంచ ప్రాణాలు* 
గా భావించి మన ఉనికిని మనమే కాపాడుకుందాం.... 
మన ముందు తరాలకు ఈ ప్రాణాధారాలను సురక్షితంగా అందిద్దాం.....
కల్పన దేవసాని
కామారెడ్డి

0/Post a Comment/Comments