ప్రజా సంక్షేమమే - ప్రగతి మార్గంlllllకల్పన దేవసాని, కామారెడ్డి

ప్రజా సంక్షేమమే - ప్రగతి మార్గంlllllకల్పన దేవసాని, కామారెడ్డి

ప్రజా సంక్షేమమే - ప్రగతి మార్గం

గుప్తుల పాలనలో స్వర్ణయుగంలా
వెలసిన దేశం నా భారతం...

ప్రతాపరుద్రుని కాలంలో పరుసవేదిని 
కలిగిఉన్న దేశం నా భారతం... 

రాయల సామ్రాజ్యంలో వజ్ర వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మిన దేశం నా భారతం... 

సింధు నాగరికత వంటి వెలకట్టలేని
శాస్త్రజ్ఞానం కలిగిన దేశం నా భారతం... 

రజియా సుల్తానా, చాకలి ఐలమ్మ లాంటి శివంగిలను కన్న దేశం నా భారతం..

గౌతమ బుద్ధుని అష్టాంగ మార్గాలు
పొందిన జంబూద్వీపం నా భారతం...

వివేకానందుని తత్వం భవితకు మార్గమై విశ్వజనీనమైన దేశం నా భారతం...

నా దగ్గర ఉన్నది నీకిచ్చి నీ దగ్గర ఉంది నేను తీసుకుంటా అనే పరస్పర సహకారం 
కలిగిన ఉన్న దేశం నా భారతం...

అహింస, శాంతి లకు నిలయం నా భారతం..
మేధావులకు కొరత లేని దేశం నా భారతం.. 
వనరులు ఖనిజాలకు నిలయమై
సశ్యామల దేశం నా భారతం..

నాడు బాలశిక్ష చదివి ప్రపంచాన్ని జయిస్తే 
నేడు పీఎచ్డీ చదివి అజ్ఞానాన్ని పొందుతూ
యువత మగత నిద్రలో మునిగిపోతూ 
చెడు వ్యసనాల బానిసత్వం నుండి
విముక్తి అవ్వాలని కలలు కంటున్న దేశం నా భారతం..

సహజీవనము, సహభావనము
మానవతా వేదంగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గంలో పయనిస్తూ 
పసిడి రంగులద్దుకోవాలని
ఆశిస్తున్నది నా కలల భారతం


కల్పన దేవసాని, కామారెడ్డి

2/Post a Comment/Comments