విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు పిళ్ళా వెంకట రమణమూర్తి కి "మదర్ థెరిసా జాతీయ సేవారత్న-2021" పురస్కారం
తే26-08-202దీ మదర్ థెరిసా 111 వ జయంతి సందర్భంగా మదర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మదర్ ఆర్గనైజేషన్ , పెనుకొండ, అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ వారు సమాజంలో వృత్తి పరమైన, మరియు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తుల ను గుర్తించి వారి సేవా తత్పరతను అభినందిస్తూ, విశాఖపట్నం వాస్తవ్యులు, "సామాజిక సేవా రత్న" బిరుదాంకితుడు, శ్రీ పిళ్ళా వెంకట రమణమూర్తి విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు , బి.వి.కె కళాశాల, వారి రక్త దాన సేవలకు గుర్తింపుగా "మదర్ థెరిసా జాతీయ సేవారత్న-2021" పురస్కారం తో అంతర్జాల మాధ్యమం ద్వారా సత్కరించి పంపిన ప్రశంసా పత్రం. మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మాన్ కె. అశోక్ కుమార్ గారు, మరియు మదర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియచేసారు. పిళ్ళా వెంకట రమణమూర్తి కి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు బంధువులు శుభాకాంక్షలు అందచేసారు.