++++🍀🍀+++🍀🍀+++
పొరుగు రాష్ట్రంలో ఉన్నాడు నాకో మిత్రుడు
పోరు సల్పి అయ్యాడు వాడు క్షతగాత్రుడు
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిపక్షాల
పోరాటం వివరిస్తూ
స్పష్టంగా పెరుగుతున్న ఆరాటం జ్ఞప్తికి తెస్తూ
వ్రాయమన్నాడు వివరంగా వాడో లేఖ నన్ను
నా మది ఊరట చెందక నేడు వ్రాస్తున్నది నా పెన్ను
ఏంటో బ్రదర్ అంత సవ్యంగా లేదు మా తెలంగాణ రాష్ట్రం వెదర్
మేం ఏరి కోరీ తెచ్చుకున్న మా అధికార పార్టిఐయింది గదర్.
మితిమీరి చెలాయిస్తున్న ది మాపై అథార్టి
పెరుగుతున్న పాదాభి వందనం వారి ప్రాపర్టి
రోజు రోజుకు రివాజుగా తిరిగి పోతున్న మూజువాణి
ఇంధనం ప్రతి నిత్యం వందనం వీరి మెజార్టి
కొంతకాలం కులాల మతాల రిజర్వేషన్స్ పెంచి సొంత గాలం తో
వారి ఇలాకలో వారిని దించి సంకుల సమరాన్నీ పెంచి
అనుదినం అమేషా తమాషా చేస్తున్నదీ ప్రభుత్వం
మరెప్పుడు మారుతుందో దీని తత్వం
ఆక్షణం ప్రకటించిన రిజర్వేషన్స్
తక్షణం వికటించి రేపాయి ఎమోషన్స్
ఫలితం జీరో అయినా హీరో విద్యార్థి లోకం లేచింది ప్రతిఘటన
శోకం గాలి వీచింది ప్రభుత్వం
మొఖం వాచింది
ఇంకా ఏమని వ్రాయాలి బ్రదర్
మా రాష్ర్రంలో వర్షం లేక ఒక ప్రక్క
రావణ కాష్టంలా రగులు కుంటున్న
బీళ్ళు అంతలోనే వర్షం ఎక్కువై మరో ప్రక్కమునిగి పోతున్న ఊళ్ళు
ఊళ్ళు గూళ్ళె కాదు మునిగాయి
పంటపొలాల మళ్ళు కళ్ళు తెరిచి చూస్తే
మాకు వళ్ళు గుల్లై చివరకుమిగిలింది కుళ్ళు.
కట్టుకున్న గేహాలు ఉన్నట్టున ఉండి
కూలాయి చఛ్ఛినట్టున్న దేహాలు
వరదలోన తేలాయి
ఇప్పుడిప్పుడే వారిలోన మతిలేని
అసమ్మతి లేచిందీ తప్పుల తుప్పులతడికను సరిచేయ చూచింది
పదవి పోయిన నయక వినాయకులు
ఎత్తుల పైఎత్తుల తమ నక్కజిత్తు పొత్తులతో
గోతికాడ నక్కల్లా నోరు తెరుచుకొని
తరచి తరచి చూస్తున్నారు
తరగిపోయి తరుముకు వస్తున్న
వారి పదవీ కాలం స్థితి మెరిసిన
విరిసిన ఉరుమై ఉరుముతున్న
ఓ గందరగోళం పరిస్తితి
ఎప్పుడు చక్కబడుతుందో చిక్కు వీడి చిక్కబడుతుందోమా
అధికార ప్రభుత్వం ముఖ ప్రకృతి
అప్పుడన్న చక్కబడుతుందని
మనం ఆశించడం కల్ల
అప్పటికే మాడి మసై పోయింది
మా తెలంగాణ రాష్ర్టం నిలువెల్లా
కనువిందు చేయు విషయాలు ఇవి కాదనుకుంటా
మునుముందు వ్రాయు విషయాలకు ఎదురు చూడమంటా
ఓ మా నేస్తం తక్షణం నీవు నీ తిరుగు జాబు వ్రాస్తావనుకుంటా
క్షణం క్షణం నీ జాబుకై నే ఎదురు చూస్తుంటా.
---గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూల్ జిల్లా.
సెల్,నెం.9491387977.
బహిరంగ లేఖ (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.
📢📢బహిరంగ లేఖ.📢📢