రాధా రమణీయం --దొడ్డపనేని శ్రీ విద్య విజయవాడ

రాధా రమణీయం --దొడ్డపనేని శ్రీ విద్య విజయవాడ

రాధా రమణీయం

లోకానికి ఆదర్శం రాధా రమణుల ప్రేమ బంధం
కన్నయ్యే ఊపిరిగా బ్రతికిన రాధ జీవితం

ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్న మురిపెం
రాధమ్మ అంటే కృష్ణయ్యలో సగభాగం

మనసులో కలకాలం నిలచి పోయే కమనీయ కావ్యం
కృష్ణయ్య ప్రేమకోసం జీవితమంతా నిరీక్షణమయం

ఆమని దరహాసంతో రమణీయ హృదయ నర్తనం
క్షణాలు బరువైన వేళ మధుమాస వెన్నెల సందేశం

ఒంటరితనంతో వేదనికి గురైన రాధమ్మ మనోగతం
కృష్ణయ్య మురళి గానానికి గోపికల మధుర పరవశం 

రసమయి జగత్తు అంతా రాధా మాధవుల స్వరాల సంగీతం
ఎదసందడిలో వసంత కోయిలల  మృదు మధుర గానం

పున్నమి వెన్నెలలో మైమర్చిన తనువు చైతన్యం
చింతాక్రాంతమైన హృదయాంత రంగాల విస్మయ సందేశం

మేఘూలు వర్షించే వేళ కన్నయ్య మురళీ దరహాసం
నిశబ్దంలో  మౌనంగా వీక్షించే ఊసుల స్వప్నం

గ్రీష్మార్తుల తాప జ్వాలలో రగిలిన రాధ హృదయం
రుధిర ప్రవాహంలో అణువణువూ తాపస ప్రళయం

ఉషోదయ ఉజ్వల కాంతిలో నింగి కెగసే రాధ యవ్వనం
కన్నయ్య లేని రాధ జీవితం లోకాన అసంపూర్ణం

శరీరాలు వేరయినా ఒకే ఆత్మగా జీవించి మురిపించిన *రాధా మాధవప్రణయం*


--దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ

0/Post a Comment/Comments