*బాల సాహిత్యం*
బోసినవ్వుల బుజ్జాయిలం
(గేయం)
పల్లవి:
చదువులమ్మ పూదోటలో పరిమళించిన పువ్వులం
సరస్వతమ్మ ఒడిలో విరిసిన హరివిల్లులం
//చదువులమ్మ//
చరణం:1
కల్లాకపటం ఎరుగని పసి మొగ్గలం
చీకూ చింతా లేని బోసినవ్వుల బుజ్జాయిలం
తల్లిదండ్రుల ఆశలకు సజీవ సాక్ష్యులం
భారతావని కలలను తీర్చే వారసులం
// చదువులమ్మ //
చరణం:2
ఆటల పాటలతో మురిసే బాలలం
స్వచ్ఛమైన మనసు కలిగిన బుడతలం
స్వేచ్ఛను కోరే మధురానుభూతులం
చాచాజీ కలల ప్రతిరూపాలం
// చదువులమ్మ //
చరణం:3
స్వచ్ఛమైన మనసుకు ప్రతిరూపాలం
బంగారు భవితకు పునాదులం
భావి భారతానికి నాయకులం
బావి భవిష్యత్తు నిర్దేశకులం
// చదువులమ్మ //
చరణం:4
దేశ సమగ్రతను కాపాడే వీరులం
సమసమాజ స్థాపన గావించే సారధులం
విశ్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకలం
దేశ సమగ్రతను నిర్మించే వారధులం
// చదువులమ్మ //
పిల్లి.హజరత్తయ్య
శింగరాయకొండ