లోకబాంధువుడు(కైతికాలు)

లోకబాంధువుడు(కైతికాలు)

పసిబాలుడవా నీవు
నీ బాల్యచేష్టలు
సమ్మోహన కరాలు
అవి లోక కళ్యాణాలు
ఆహా!నీలీలలు ముగ్ధమోహనాలు
నీవు లోకబాంధవుడవు కృష్ణా

బాల్యక్రీడలతో నీవు
గోపకుల చెలికాడుగా
ఆటపాటలతోను
వెన్నెల వేలుపుగా
ఆహా! మురిపించావు
మమ్ము మైమరిపించావు

కంస,కాలయవనులను
శిశుపాల సోదరులను
మట్టుబెట్టిన నువ్వు
దుర్యోధనాదులను
చక్కగ అంతమొందింపజేసి
దుష్టత్వహరుడైనావు కద

అన్నా నీవే దిక్కు
అనియన్న ద్రౌపదికి
నిండుసభలో ఆమె
వస్త్రాపహరణానికి
ఆహా! భంగం వాటిల్లకుండా
కాపాడిన ఆశ్రితవత్సలుడవు

రణమున నీపలుకులు
కార్యోన్ముఖునిగను
గొప్ప దీక్షాపరునిగ
ఓ మహాయోధునిగను
వహ్వా! అర్జునుని చేసెను
సృష్టికది భగవద్గీతగ అందెను

శిశుపాలుడు తిట్టిననూ
చూపించావు శాంతం
సాందీపుని మనసును
చేసినావు ప్రశాంతం
వహ్వా! సఖ్యం,వాత్సల్యం
అన్నీ నీమధుర గుణములే

ధీరోదాత్తుడవు నీవు
వ్యూహ నిర్మాణంలోను
నీదైన చతురతలోను
రాజనీతిజ్ఞతలోను
వారెవ్వా! నిన్ను మించిన వారేరి
నీమార్గం మాకు అనుసరణీయం

లీలామానుష రూపా
నందనందనుడా
రుక్మిణీ వల్లభుడా
నవనీత చోరుడా
ఆహా! కృష్ణా నీచరిత 
మధురాతి మధురం కదా

వి.టి.ఆర్.మోహనరావు,
పాల్వంచ.

0/Post a Comment/Comments