మేఘనాథుడు
సంపదకు నిలయమైన లంకాపురం
దానవుల రాజధాని నగరం
దశకంఠుడు లంకాధిపతి
లంకేశ్వరుని పుత్రుడైన మేఘనాథుడు
తండ్రికి తగ్గ తనయుడు
అశ్వమేధం రాజసూయం వంటి
యజ్ఞ యాగాదులు చేసి
తామసి వంటి మాయా విద్యను
శత్రువులకు కనిపించని రథాన్ని
దివ్యమైన అస్త్రాలను వరాలుగా పొంది
అహంకారంతో దేవలోకంపై దండెత్తి
దేవేంద్రుడిని మాయావిద్యతో బంధించగా
దేవలోకం అల్లకల్లోలమైంది
బ్రహ్మదేవుడు స్వయంగా
వచ్చి మేఘనాథుడికి వరాలిచ్చి
ఇంద్రుడిని బంధ విముక్తిడిని చేసాడు
ఆనాటి నుండి మేఘనాథుడు
ఇంద్రజిత్తుగా పేరు పొందాడు
రామ రావణ యుద్ధంలో
ఇంద్రజిత్ మేఘాల మాటున
యుద్ధం చేసి లక్ష్మణుడిని
మూర్ఛ పోయేట్టు చేసిన
మాయావీరుడు
ఆచార్య ఎం.రామనాథం నాయుడు, మైసూరు
+91 8762357996