మదర్ థెరిసా జోహార్లు మీకు
ఎక్కడో అల్బేనియా దేశాన పుట్టింది
మనందరం ఆదరంగా పిలుచుకునే
మన మదర్ థెరిసా
అసలు పేరు 'యాగ్నిస్ గోన్ జా'
గోన్ జా అంటే ఓ గులాబీ మొగ్గ
ఎంత అందమైన పేరు
సార్థక నామధేయురాలు కదా!
పువ్వు పుట్టగనే పరిమళించు
అన్న నానుడిని నిజం చేశారు వీరు
చిన్న వయసులో సన్యాసం
అదీ సమాజసేవకై
కుష్టు క్షయ లాంటి రోగులకు
చేయూత నిచ్చిన మహాతల్లి
నిర్మలా శిశుభవన్ స్థాపించి
అనాథ శిశువులకు అమ్మతనం చూపింది
కంటేనేనా? అమ్మ! ప్రేమతో కాకూడదా అమ్మ?
అలా అమ్మ కన్నా మిన్న అనిపించుకుని
ఎందరో అనాథలకు నిజమైన అమ్మగా
అందరికీ ఆదర్శ మహిళగా
నిలచింది మన మానవాళిని కన్న తల్లి
మన థెరీసా ఓ ఆల్సేనియన్
పౌరసత్వం ద్వార భారతీయత
విశ్వాసం ద్వారా ఓ కాథలిక్ సన్యాసిగా
మనసు యేసు నందు
ప్రేమ ప్రపంచ మంతటా పంచుతూ
మదర్ అన్న పదానికి పర్యాయపదమై
కరుణ తన బ్లడ్ గ్రూపుగా
జాలి ఆదరణ ప్రేమ వాత్సల్యం
ఇలాంటి అన్ని పదాలకు
బ్రాండ్ అంబాసిడర్ గా వెలసి
భారత రత్న అవార్డు పొందిన మహిళా దీపం
ప్రపంచ శాంతికి కృషిచేసినందుకు
నోబెల్ శాంతి బహుమతి పొందిన
మహిళా మాణిక్యం
వీరి జయంతి సందర్భంగా వారిని
స్మరించుకోవటం మానవాళి కనీస కర్తవ్యం
జోహార్లు! ఓ తల్లీ.....మీకు జోహార్లు!
-- వి.డి. రాజగోపాల్,
9505690690.
జోహార్లు! ఓ తల్లీ.....మీకు జోహార్లు!
-- వి.డి. రాజగోపాల్,
9505690690.