జీవితం..ఒక పరీక్ష..!?(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

జీవితం..ఒక పరీక్ష..!?(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

జీవితం..ఒక పరీక్ష..!?(కవిత)

అవునన్నా కాదన్నా..,
"జీవితం ఒక పరీక్ష" నే..!?
ఎన్నో కష్టాలు,నష్టాలూ,
ఎన్నెన్నో అనుభవాలు,
ఎదురు దెబ్బలు..!?

ఏమి వర్ణించ జాలని సమస్యలో..!?? కదా..?
ఎన్ని నిరాశా నిస్పృహలు..!
ఎప్పుడూ అనుకోని సంఘటనలు,సమస్యలు..!?
మనిషి సహనానికి పరీక్షలు..!?

ఎన్నో ఒత్తిళ్లతో కూడిన పనులు,జీవిత పాఠాలు..!
ఆహా ఏం చెప్పాలి..!
"ఎందుకు పుట్టించావురా దేవుడా...!" దేవుడితో,
అంటూ మొరపెట్టు కోవడాలు..!??

అన్ని ఆటల్లో కెల్లా జీవితం ఆడే ఆట ఆద్యంతం రసవత్తరంగా కొనసాగుతుంది..!?
కోపతాపాలు,ఆవేశాలు
అలజడులు..!?

వార్నీ.. ఏం జీవితపు 
పరీక్షరా నాయన..ప్రశ్నలు బలే గొట్టుగున్నాయి..!?
జవాబులు దొరకట్లేదు,
వ్రాయడానికి..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.

0/Post a Comment/Comments