ఆత్మీయ అమృతం
కలకాలం తోడుంటా అనే అనుబంధం
తోడ బుట్టిన వారి బాగోగులు చూస్తాననే వాగ్దానం
కంటికి రెప్పలా కాపాడతాననే నమ్మకం
లోకంలో అత్యంత విలువైన మన ఆత్మీయం
అరమరికలు లేక మధురంగా నిలవాలి కలకాలం
నీ క్షేమమే నాకు ముఖ్యమని తెలిపే సమయం
నిన్ను మురిపంగా చూసుకోవాలనే ఆత్మీయ ఆరాటం
రక్త సంబంధానికి అనురాగమే నిర్మల ప్రతీకం
శరణు కోరిన సోదరి కోసం ప్రాణం ఇచ్చే బంధం
అనురాగానికి అద్దం పట్టే తన్మయత్వ బంధం
తనువులు వేరైనా ప్రాణం ఒకటిగా బ్రతకటం
పేగు బంధమై పంచుకున్న అక్క తమ్ముళ్ళ అనురాగం
నీ కన్నీళ్లను ఇంటి గడప దాటినివ్యను అన్న నమ్మకం
ప్రేమగా చూసుకుంటూనే, చూపించే చిలిపి పెత్తనం
అమ్మ తరువాత అమ్మ గా ప్రేమానురాగాల, అల్లరి జ్ఞాపకాల మధురానురాగం
భారం కాదు భాధ్యత అని చూసుకునే గొప్పతనం
మమతల మాగాణిలో పూసే పువ్వులం
మమకారానికి ఆకారమైన చిరుదివ్వెలం
భాంధవ్యం లో మమతలు కురిసే అమృతం
దొడ్డపనేని శ్రీవిద్య
విజయవాడ
ప్రవాహినీ అంతర్జాల పత్రిక కోసం నా ఈ కవిత
నమస్తే🙏