అభిలాష
---పొన్నూరి భారతలక్ష్మి, ముంబై.
అందాల వనంలో విహరించాలని
గులాబీపై మంచుబిందువును తాకాలని
ప్రతి పుష్పాన్నీ చూస్తూ పలకరించాలనీ అభిలాష
అందమైన ప్రకృతిని ఆస్వాదించాలని
జలపాతాలలో ఆటలాడాలనీ
మంచుకొండలను అధిరోహించాలనీ అభిలాష
ఆకాశంలో పక్షిలా స్వేఛ్ఛ గా విహరించాలని
మేఘాలను అందుకోవాలని
అంత ఎత్తునుండి ధరణి అందాలను వీక్షించాలని అభిలాష
తారలను తెచ్చి మాలికలల్లాలని
చంద్రుని అందాలు చూడాలని
దేవతలను దర్శించాలని అభిలాష
సూర్యోదయ సూర్యాస్తమయాలు చూడాలని
వర్షాన్ని చూస్తూ గడపాలని
ప్రకృతిని ఆరాధించాలని నా చిరకాల అభిలాష