అమర వీరా జోహార్లు ---డా వి.డి. రాజగోపాల్

అమర వీరా జోహార్లు ---డా వి.డి. రాజగోపాల్



అమర వీరా జోహార్లు

ఈ ఉదయం భరతమాత
ఓ విప్లవవీరున్ని కన్న  ఉదయం
లేలేత వయసది
ప్రేమదోమ అంటూ
ప్రేమలేఖలు వ్రాసుకునే ప్రాయం
అయితే ఎక్కడో పుడతారు
ఎందుకో పుడతారు
సమాజం కోసం పరితపిస్తారు
కొందరు వివ్లవ వీరులు

వజ్రం రాళ్ళల్లోనే పుడుతుంది
అయితే అన్ని రాళ్ళకు భిన్నంగా
సూర్యకాంతినే తిప్పికొడుతూ
అంత ప్రకాశవంతంగా మెరుస్తుంది
అది దాని ప్రత్యేకత

అలాగే తమ ఆశయాలతో
ప్రకాశిస్తారు కొందరు
ఆకోవకు వస్తాడు మన భగత్ సింగ్
అది అవిభాజ్య  భారతం
పాకిస్థాన్ భూభాగంలో
ఉద్యమాల కుటుంబం
అందు ఉదయించిన ఓ నిప్పురవ్వ
మన భగత్ సింగ్,
అది తుపాకుల వంశం
ఎటుజూసినా తుపాకులే,
నాలుగేళ్ల ప్రాయంలో
సరదాగా నాలుగు గరికె మొక్కలు నాటాడట,
నాన్న చూడు తుపాకులు నాటానన్నాడట,
పుట్టీ పుట్టగనే విప్లవభావాలు
మొలకెత్తగా,
అవి అలానే చిగురించి,
చిన్న వయసులోనే
స్వాతంత్ర్య ఉద్యమంపట్ల ఆకర్షితుడై,
అనేక సంస్థలకు నాయకుడై,
భారతంలో అభిమన్యుడు వంటివాడు
మన భగత్ సింగ్,

తన కళ్ళముందు,
ఓ స్వాతంత్ర్య సమరయోధుడు,
లాలా లజ్ పతి రాయ్
హత్య కావించబడడం చూసి,
ఆ హంతకునిపై కాల్పులు జరుపగా,
గురితప్పి ఓ పోలీసు మరణంతో,
ఓ విప్లవం ఉరికంబానికి
బలైన వీరుడు ఆనాడు,

తన ఉరి భారతావనిలో
ఉద్యమానికి ఊపిరి కావాలని
ఆశించిన వీరుడు మన భగత్ సింగ్

క్షమాభిక్షకై కోరమంటే
తిరస్కరించిన అమర వీరుడు,
చివరికోరిక ఏమంటే
లెనిన్ జీవిత చరిత్ర చదవటం
అన్నాడంటే వీరి ఆశయస్పూర్తి
ఏపాటిదో కదా!
రక్తం అణువణువునా దేశ భక్తి
భారత మాత వీర పుత్రుడంటే
భగత్ సింగ్
స్వాతంత్ర్య ఉద్యమంలో
శౌర్యం అనే మొక్కలు నాటిన
మన భగత్ సింగ్ జయంతి నేడు
స్మరిద్దాం ఓమారు 
ఈ అమర వీరుని

---డా వి.డి. రాజగోపాల్
9505690690




0/Post a Comment/Comments