రేపు ఐక్య రాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవంఅనుసరిద్దాం -----డాక్టర్ సాహితి వైద్య,

రేపు ఐక్య రాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవంఅనుసరిద్దాం -----డాక్టర్ సాహితి వైద్య,

రేపు ఐక్య రాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం
అనుసరిద్దాం

ప్రపంచం అగ్నిగోళం మీద ఉంది
అన్నము దేవుడు ఎరుగు
అణుబాంబులకు కరువు లేదు
పేరుకు ఐక్యరాజ్య సమితి
అగ్రరాజ్యాల కుతంత్రీ
ధమన నీతిలో అగ్రరాజ్యాలు
వారికి ఎదురు వస్తే పట్టింపులు లేవు సూత్రాలకు
చైనా రాజ్య విస్తీరిణ కాంక్షా
పాక్ పన్నగాలు
ఇజ్రాయిల్ పాలిస్తానా సమస్య
ఇరాన్ ఇరాక్, క్యూబా, అమెరికా
పాక్ టెర్రరిస్ట్ కుతంత్రాలు
ఏ దేశం గుండెలు చారచి చెప్పగలదు నాకు ఢోకాలేదు అని
సెప్టెంబర్ 11 దాడులు తర్వాత
ప్రపంచ పెద్దన్నా నివ్వెర పోయింది
కరోన అతకుతాళం చేసింది
విశ్వసనీయత దిశగా సాగుదాం
నేరుగా యుద్ధం కన్నా
ప్రచ్ఛన్న యుద్ధం ప్రమాదం
ఆయుధాలను అమ్ముకునే
కుతంత్రతలో చిచ్చు పెట్టి నవ్వుకుంటున్నాయి
రాజుకున్న నిప్పు మనకు
అంటుకుంటుందన్నా మతి భ్రమించి
ప్రపంచం రెండు యుద్ధాలు చూసింది
మూడో ప్రపంచ యుద్ధం
గగన తలం నుంచే
అందరూ సచ్చి మనం మిగిలితే
వచ్చేది శూన్యమే
హిట్లర్, ముస్సోలోని, మీన్ అమిన్ ఎందరో కాలగర్భంలో
కనుమరుగు అయ్యారు
సోమాలియా, ఇతోపియా, తువ్వాలు, రువాండా మరెన్నో
దేశాలల్లో పసిపిల్లల మరణ మృదంగాలు వినిపిస్తూనే ఉన్నాయి
భద్రత మండలి లో శాశ్వత సభ్యదేశాలు విటో అధికారాన్ని
స్వలాభం కోసం వాడుకుంటున్నాయి
మూడో ప్రపంచ రాజ్యాలు
అస్తిత్వ పోరాటాలను వదిలి
ఐక్యత రాగాలు వినిపించాలి
చార్టర్ నియమాలు అనుసరించాలి
ప్రతి దేశం వసుధైక కుటుంబ
భావన ప్రజ్వరిల్లాలి
సామ్రాజ్యకాంక్ష భావన వదిలి
సంక్షేమ భావన పెరగాలి
విశ్వకళ్యాణానికి  ప్రతికలై నిల్వలి
నేను నా దేశం స్థానంలో నా ప్రపంచం అనే ధోరణికి స్వాగతం పలకాలి

--డాక్టర్ సాహితి వైద్య,
పిజియో తెరపిస్టు,
కామారెడ్డి.

0/Post a Comment/Comments