ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో
ఆచార్యాదేవో భవ
జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గరువు
జ్ఞానార్థులకు కల్పతరువు గురువు
మరుగుతున్న రాతికి జీవం పోసే దేవుడు గురువు
జీవితం అనే బడిలో ఆదర్శం గురువు
జ్ఞానాన్నిచ్చే గురువు ఆచార్యుడు
భవిష్యత్తుకు మార్గంచూపే
మార్గదర్శకులు ఉపాధ్యాయుడు
అజ్ఞానాన్ని తొలగించే సరస్వతి
పుత్రుడు ఉపాధ్యాయుడు
మంచిమార్గం చెప్పేవాడు గురువు
గురువు లేని విద్య గుడ్డి విద్య
గురువుపూజ దైవంతో సమానం
గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః
పేరు:పసుల లాలయ్య (విద్యావాలంటీర్)
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు
మం:బొంరాస్పేట్ జిల్లా: వికారాబాద్ చరవాణి: 7893999525.