రాయలభూమి
నిర్లిప్తిత, నిరాశ
భారమైన హృదయాలు
మావి|
ఎన్ని పూజలు చేసినా
సాగు - తాగు నీటికై
ఆకాశంవైపు ఆశగా
చూడాల్సిన బ్రతుకులు మావి|
చేరదీసిన వారిని నమ్మటం
వారుపెట్టె అన్నంముద్దకే
జీవితాన్ని సర్వం అర్పంచుకొనే
హృదయాలు మావి|
మా గురించి కంటే
ఇతరుల కోసమే ఎక్కువ బ్రతికాం
రతనాల నేల
రాళ్ళతో ... నిండిపోయినట్లు
మా గుండెలు...బండ బారినా
మాకూ ప్రేమ, అభిమానం
ఉన్నాయి
మాకూ మంచితనం, మానవత్వం
ఉన్నాయి
మామాట కఠువేమో గానీ
మామనసు మెత్తన|
రాయల భూమిలో
జ్ఞానం - విజ్ఞానం
నాట బడిన విత్తులు ...
నేటి విశ్వమానవ
విజయ కేతనాలు
మా దార్శనికత
మా మాట
మా నడత
మా స్వచ్ఛత
ఆదర్శనీయం
అందుకే ఇది రాయల భూమి
రచన
డా|| బాలాజీ దీక్షితులు పి.వి.
తిరుపతి
8885391722