మనం - మన సమాజం ---దొడ్డపనేని శ్రీ విద్య

మనం - మన సమాజం ---దొడ్డపనేని శ్రీ విద్య

*మనం - మన సమాజం*

*సమాజం తీరు*
సమాజం లో బ్రతకాలి అంటే
నింగి కెగసే గాలిపటంలా ఎదిగాలి
ఒకరిని ముంచుతూ అయినా బ్రతకాలి

*సమాజంతో పాటు జీవించాలంటే*
మంచితనం ముసుగు వేయాలా...
కష్టపడే వాడిని చూసి ఏడ్వాలా.....

సహాయం తృప్తి కోసమా!
సమాజ మెప్పు కోసమా!

వ్యక్తిత్వాన్ని విమర్శిస్తే ఊరుకోవాలా
గెలిచే దమ్ము తో ఎదురు తిరగాలా
బెదిరించే వాడిదే రాజ్యమా
ఎదుటి వారి మీద నిందలు అవసరమా

అందరూ నా వాళ్ళని మోసపోవాలా
గుణమున్న వాడు దరిద్రుడిగా మిగలాలా
మానవత్వ ముసుగు అవసరమా

సమాజంలో మార్పు అవసరం
మరి తెచ్చే వాళ్ళు ఎవరు
పేదవారికి ధైర్యం లేదు
ధనవంతుడికి అవసరం లేదు
సామాన్యుడికి సమయం లేదు

స్వార్థపరుల చేతిలో నలిగి పోవలసిందేనా
ఎదిరిస్తే శత్రువులు పెరుగుతారని భయం

గౌరవ మర్యాదలు తో అందరితో కలిసి మెలిసి జీవించగలిగే సమాజంలో ఉన్నామా మనం
*ఇదేనా సమాజం తీరు*

✒️📖✒️📖✒️📖✒️


*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ

0/Post a Comment/Comments