నా లోకం --ఇడుకుల్ల గాయత్రి

నా లోకం --ఇడుకుల్ల గాయత్రి

నా లోకం

సగం జీవితం నేను గడిపేది
నా చేతుల గాజులు గల గల చప్పుడు చేసేది
నా కాళ్ల పరుగుతో కలియ తిరిగే గది 
గంటల కొద్దీ వెలుగుతూ అందరి కోరికలు తీర్చే నిధి
నేను మాత్రమే విహరించే ఏకాంతం 
మనసు దోచే గుమగుమలు
మొగని నోటి రుచికి తగ్గ మసాలా గుబాళింపులు
పొద్దున్నే తలుపు తీస్తే
రాత్రైతే గాని ఆగని  గిన్నెల చప్పుళ్లు
అతడి కోరికల్తో నిట్టూర్పు విడిచి 
గది గోడల నడుమ చెమటోర్చి చేతులు చెసే గరిట నాట్యాలు

కొంటెగా పెనిమిటి గిలిగింతలు
పంటి విరుపుతో  అత్తగారి రుస రుసలు
మనసుని విరిచేసే చివాట్లు
గది నిండా రాలిన కన్నీళ్లు
రాత్రుల్ని వేదించే పగటి ఙ్ఞాపకాలు
బరువెక్కిన గుండెను పంచుకునే
నా భావాల అక్షరాల కాగితాలు
పలకరిస్తేకూడా పలకని జీవితాలు
బిక్కు బిక్కు మంటూ కాలంతో పోరాటాలు
అందరికీ నేను కావాలి
అయినా ఒంటరిగా పోరాడాలి
నేను నిరంతర ప్రేమ పోరాటాన్ని
అందరూ చులకనగా చూసే ఒక 
మనసున్న బొమ్మని

మీ 
ఇడుకుల్ల గాయత్రి

0/Post a Comment/Comments