పెళ్లి --- ఎస్.ఆర్. పృథ్వి

పెళ్లి --- ఎస్.ఆర్. పృథ్వి



పెళ్లి

ఇంటి ముందర 
పచ్చని పందిరి
మామిడాకుల తోరణాలు
వచ్చి పొయే జన సందడి
పన్నీటి జల్లుల ఆహ్లాదం 
పేరంటాళ్ల తోడ ఉల్లాసం
సంప్రదాయాల వెల్లువ
వచ్చిన వారి చేతులకి
గులాబీల అలంకారం
ఇంటి లోగిలి నిండా
పెళ్లి పరిమళం
అదొక సహజ సిద్ధమైన 
ఆనందాల కోలాహలం

ఇప్పుడది ఆర్భాటాల వల
భయం గుప్పిట్లో బ్రతుకు జాడ
మాస్కుల మేకప్పులు
సనిటైజర్ల ఆహ్వానం
పెళ్లిళ్ల కోసం కాకుండా
ఫొటోల కోసమే పెళ్లిళ్లు అన్నట్టు
సహజత్వాన్ని తుడిచేసి
కృత్రిమానికి రంగులద్దే
ఫొటోగ్రాఫర్ల సందడి
మౌనమొక అలంకారం
ఎరువు తెచ్చుకున్న 
ఊపిరి లేని పలకరింపులు
నవ్వులలో నాణ్యత లోపం
తృప్తి క్షీణించిన సంబరాలు
పెళ్లిళ్ల నిండా
వెగటు పుట్టే యాంత్రికం

--- ఎస్.ఆర్. పృథ్వి
 9989223245

          

0/Post a Comment/Comments