మందహాసం
చిన్న చిరునవ్వు చేరువై న వేళ
చింతలను ఆపి ఆకలిని బాపి మదిని ఉల్లాసంతో నింపుతుంది
కాసులు లేకున్నా
చిన్న చిరునవ్వు
కనక వర్షం కురిపిస్తుంది
వదనము న నవ్వు
ఎన్నటికీ వీడని పువ్వు
బాధను దూరం చేసి
బంధాలను దగ్గర చేస్తుంది
సుమధుర దరహాసం
నిత్యనూతన మధుమాసం
చిరు మందహాసం
కొనలేని ఆస్తి తూచ లేని ధనం
నాలుగు విధాల చేటు ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల ఆరోగ్యం ఇప్పుడు
నవ్వు తో రోజు మొదలు పెట్టు వీడ వు ఎప్పటికీ నవ్వుల ఛాయలు
అవే బతుకు కు నయాగర హొయలు
పేరు
విస్సాప్రగడ పద్మావతి
హైదరాబాద్