కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కొరకు "తెలంగాణ గాంధీ" ---ఉమశేషారావు వైద్య

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కొరకు "తెలంగాణ గాంధీ" ---ఉమశేషారావు వైద్య

తెలంగాణ గాంధీ

   పుట్టింది కొమరం భీం జిల్లా
   ఆయన శ్వాస తెలంగాణ
   సమరయోధుడిగా రణం
   చేసి క్విట్ ఇండియా
   క్విట్ తెలంగాణ ఉద్యమంలో
   ఊపిరి ఉన్నంత వరకు
   సాధకుడు మన కొండ
   బడుగుల అండ చేనేత కు అండ
శాసన సభ్యుడిగా అసిఫాబాద్ నుండి ఎన్నికై 
భాగ్యనగరం నుండి ప్రాతినిత్యం వహించి
ప్రజల బాగోగుల కు తపించిన 
బడుగు జీవి
ఆస్తులు కూడా బెట్టలే
అంతస్తులు కట్టలే
పదువుల కొరకు పరుగులు తియ్యలే
మంత్రి పదవి కూడా  తెలంగాణ 
కోసం తృణప్రాయంగా వొదిలి
నిబద్దతకు నిదర్శనం
తొలి మాలి దశలలో తెలంగాణ కొరకు రణం చేసి 
స్వప్నం చూడకుండానే కళ్ళు మూసిన
తెలంగాణ నిఖార్సయిన నాయకుడు
చేనేత కు చేయూత నిచ్చి
సాహకార వ్యవస్థ లోకి
తీసుకెళ్లి అహర్నిశలూ శ్రమించిన యోధుడు
ఆహార్యం అతి సాధారణం
ఆలోచనలు అసామాన్యం
ఆయన తెలంగాణ వాదిగా
ఆయన మన గాంధీ

  ఉమశేషారావు వైద్య
  కామారెడ్డి


0/Post a Comment/Comments