బాల గేయం ----మార్గం కృష్ణ మూర్తి

బాల గేయం ----మార్గం కృష్ణ మూర్తి

 -మార్గం కృష్ణమూర్తి

బాల గేయం

గగనాన నక్షత్రాలు ఆడుతున్నవి
విశ్వాన పక్షులు పాడుతున్నవి
అవనిలో నెమలులు వేడుతున్నవి
ఆకాశాన మేఘాలు వీడుతున్నవి

కాలాలు ఋతువులు మారుతున్నవి
మలయ మారుతాలు మీరుతున్నవి
వాగులు వంకలు పారుతున్నవి
సముద్రాలు నదులు కోరుతున్నవి

చెట్లకు చెదలు కూడుతున్నవి
తరువుల ఆకులు వాడుతున్నవి
వృక్షాల కొమ్మలు మాడుతున్నవి
చెట్ల మానులు మూడుతున్నవి

నెమళ్ళు తోటకు చేరుకున్నవి
సర్పాలు మెల్లెగా జారుకున్నవి
మయూరాలు కాస్త ఊరుకున్నవి
పాముల తత్వాలు మారకున్నవి

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments