ఇంటి మహాలక్ష్మినువ్వు
పూసిన మల్లె పువ్వు
బోసినవ్వుల నువ్వు
దేవుడిచ్చిన బొమ్మ
మమతలుపంచేఅమ్మ
అందాలొలికే కొమ్మ
గలగల చేతి గాజులతో
ఘల్లుఘల్లుమనే గజ్జలసవ్వడితో
ఇల్లంతా సిరి నవ్వులు కురిసిన ముత్యాలజల్లు
ప్రేమను పంచే జీవనది త్యాగానిప్రతిరూపం
బాధలుపంచుకొనేబంధం
ఆప్యాయతలుకురిపించే వెన్నెల
జగతికే వెలుగు జగమంతా వెలుగు.
---సుగుణ మద్దిరెడ్డి,
ఐలవారిపల్లె, ఐరాల.