నిశి రాత్రి లో .....వాణిరమేష్

నిశి రాత్రి లో .....వాణిరమేష్

నిద్రలేని రాత్రులు
కాలం తో పనిలేని కలం
ఊహలతో రాసుకుంటున్న కవితలు
మది తలపులను తట్టి లేపుతున్న వ్యధలు
నన్ను చూసి నవ్వతున్న..మనసులు.
మదిలో దాచుకున్న ఊసులు
ఎన్నో చెప్పాలనుకున్న...
 ఏమి చెప్పాలేనేమో అని వెనుతిరిగాను....
 నీ ఆలోచన ఏమిటో తెలియక
నా మది లో పలికిన వాణి కి 
నీ మదిలో చోటుందో లేదో
ఏమో కాలానికే తెలియాలి..

మీను..... 🖊️(కలం పేరు) 



0/Post a Comment/Comments