గాంధీ తత్వం (సున్నితాలు) -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు

గాంధీ తత్వం (సున్నితాలు) -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు

గాంధీ తత్వం (సున్నితాలు)
------------------------------------

సతతము పలకమన్నాడు సత్యము
వెంబడించాడు గాంధీ నిత్యము
వెలలేని మేలిమి  ఆణిముత్యము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఉప్పు సత్యాగ్రహమును నడిపాడు
స్వదేశీ వస్త్రాలు ధరించాడు
దేశ గౌరవమే నిలబెట్టాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

అహింసామార్గము చూపి నడిచాడు
అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు
మాతృభూమి క్షేమమే తలచాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మంచిపనులే గాంధీ చేశాడు
అందరి మదుల్లో కొలువయ్యాడు
జాతిపితగా బాపు మారాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సాధుశీలి మహాత్మా నిజంగా
అందరూ కొలువాలోయ్ గొప్పగా
సదా చూడాలోయ్ గౌరవంగా
చూడచక్కని తెలుగు సున్నితంబు!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు


0/Post a Comment/Comments