చెత్త కుప్పలు..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

చెత్త కుప్పలు..!(కవిత), ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

చెత్త కుప్పలు..!(కవిత)

అఖ్ఖరకు రాని బంధుత్వాలు..!
అవసరానికి పనికి రాని బంధాలు..!
ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నారు..!? ఆశలు పెట్టుకొని కాబోలు..!??
ఎదురు చూపులే మిగిలేది అని అంతిమంగా తెలిసి అవాక్కయ్యారు..!??
మిత్రులూ,
బంధు జనాలు..ఎవ్వరూ గాని ఎందుకు పట్టించుకుంటారు..!?
మా తిప్పలే..మాకు ఎక్కువయ్యాయి అని తప్పించుకునే ధోరణి దర్శనమిస్తుంది..!?
ఏం చేస్తాం..అలా ఏడ్చాయి..సత్సంబంధాలు లోకంలో..!, నామ్ కే వాస్తే..!??
ఎవడన్నా ఏ ఏట్లోనన్న కొట్టుకుపోనీ..ననే నిర్లక్ష్య వైఖరి..!?
చెత్త నన్న ఈ లోకంలో మళ్ళీ పనికి వస్తుందేమో.. రీసైక్లింగ్ అయ్యి.. కానీ ఈ మన అనుకునే చెత్త కుప్ప ఎప్పటికీ పనికి రానిదే..!
అందుకే అలాంటి 
చెత్తకుప్పలను విసర్జించడమే ఉత్తమం..!???

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments