నాలోని భావాలు ---వాణిరమేష్

నాలోని భావాలు ---వాణిరమేష్

నా లోని భావాలు  కొన్ని  మనసుని తాకుతున్న నిజాలు....

కళ్ళకు కట్టిన గంతలై.... వీనుల విందై ..
ఎదుటివారి లో తప్పునో....బలహీనతనో.... లేక.....
అలసత్వాన్నో.... అమాయకత్వన్నో....
అస్త్రంగా మార్చుకొని..
పొందిన  ప్రేమను....సహాయాన్ని.... కాలరాసి....
తన  అవసరాలకు ఎదుటివారిని వాడుకునే వ్యక్తికి 
ఏ బంధము విలువ తెలుసు.....
ఆకలేస్తే నో బాధాకల్గితే నో గుర్తొచ్చే స్నేహం...
నీ ఆకలిని....నీ బాధని...మాత్రం 
సంతోషం లో  మర్చిపోయింది.... 
అయినా  నీకోసం.... అంటున్న నాకు ........ 
మురిసినంత సమయం పట్టలేదు........
ఏ రోజైనా ఎలా ఉన్నావు?ఏమీకావాలి?అని 
అడుగుతావేమో  అని నా ప్రేమ ఎదురుచూస్తుంటే....
నీ హృదయ భావనలో నేను దూరం అయిపోతానేమో...... అన్న భయం
నా లోని మౌనం గుర్తు చేస్తుంది
చివరకు నా గుండె పగిలిన నీ రూపం చెదరకుండా చూసుకుంటా.......
అప్పుడైనా నీ రూపం లో నా మనస్సు దాగి ఉందని....... 
నువ్వు తెలుసుకుంటావని...... భావిస్తూ.... 
ప్రేమకై ప్రేమతో ప్రేమగా ఆర్థిస్తూ

.....మీను

0/Post a Comment/Comments