విప్లవ కిరణం..! ---సుజాత పి.వి.ఎల్., సైనిక్ పురి, సికిందరాబాద్. భగత్ సింగ్ జయంతి సందర్భంగా..వచన కవిత

విప్లవ కిరణం..! ---సుజాత పి.వి.ఎల్., సైనిక్ పురి, సికిందరాబాద్. భగత్ సింగ్ జయంతి సందర్భంగా..వచన కవిత

విప్లవ కిరణం..!

 అలముకున్న చీకట్లను
 చీల్చేందుకు ఉదయించిన
 వెలుగు కిరణం..
 ఆంగ్లేయులను హడలెత్తించిన భారతీయ 
 సమర సింహం..                              
 రాజధాని వీధుల్లో 
 ఎర్ర కాగితాలు చల్లి  
 ప్రజలను చైతన్య పరచేందుకు.. 
 ఎర్రపూలవనంలో విరిసిన  
 అరుణ కిరణం.. 
 నిర్భయత్వానికి నిలువెత్తు సాక్ష్యం.. 
 అతి చిన్న వయసులోనే
తెల్లదొరల దుర్నీతిని దునుమాడిన 
విప్లవ కిరణం..
బానిస శృంఖాల నుంచి
భరతమాతకు స్వేచ్ఛ కల్పించేందుకు..
 భావి తరాల కోసం 
 తన జీవితాన్నే అర్పించిన త్యాగ గుణం..                    
 ఆశలు, ఆకాంక్షలతో                                            
 ఆనందంగా గడపడం జీవితం కాదు..                        
అవసరమైతే దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించడమే 
నిజమైన దేశభక్తి అని నిరూపించిన అఖండ దీపం..
యవ్వన ప్రాయంలోనే దేశం కోసం 
ప్రాణ త్యాగం చేసి
''ఇంక్విలాబ్ జిందాబాద్!'' అని నినదించిన తీరు 
గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది..
భారతదేశపు స్వాతంత్ర్య పోరాట నేపధ్యంలో
విప్లవ చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన సువర్ణాధ్యాయం భగత్ సింగ్ జీవితం..!
దేశ పౌరులకు నిత్యస్ఫూర్తిదాయక చరితం..!!

---సుజాత పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.



0/Post a Comment/Comments