సత్యాగ్రహి --- శ్రీమతి సత్య మొం డ్రేటి

సత్యాగ్రహి --- శ్రీమతి సత్య మొం డ్రేటి


సత్యాన్వేషి

సత్యాగ్రహి

మహనీయా మహాత్మా
సత్యానికి నిలువెత్తు రూపమా మూర్తీభవించినమానవత్వమా
శాంతియే నీ మతము గా
సత్యమే ఆయుధంగా
స్వాతంత్ర పోరాట విజయుడు  వి...
అహింసయే మానవ ధర్మమని
బోధించిన మహాప్రవక్త వి
ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మహోన్నత వ్యక్తి వి
భారతదేశ ఔన్నత్యాన్ని పెంచిన జాతిపితవు..
భారత స్వతంత్ర పోరాట రథ చక్రవర్తి వై అజేయుడు గా మాతృ భూమి శృంఖలాలు తెంచిన సాధు శీలి వి
నీ సత్య సూత్రాలు మాకు మార్గదర్శకాలు....
సమతా మమతలకు నిలయమైన మన దేశ చరిత్రలో నీవు అనుసరించిన సత్యమార్గం.... చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి 
అందరికీ మార్గదర్శకమైంది...
నీవు నేర్పిన సత్యాగ్రహ మార్గం అజరామరమైన ది......
సత్యాన్వేషనుకివందనం అభివందనం మాకు
నీ బాటలో నడిచే భాగ్యం మా కొసగుము......
మహాత్ములకు మరణం లేదు మా అందరి హృదయాలలో మీరు చిరస్మరణీయులు
సత్య రూపునకు అనంత కోటి అక్షర సుమమాల...
సహస్ర కోటి అక్షర నీరాజనాలు


పేరు శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు హైదరాబాద్
ప్రక్రియ వచనం
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1

0/Post a Comment/Comments