మనం మారదాం - స్వచ్చభారత్ ను సాధిద్దాం -వి. కృష్ణవేణి

మనం మారదాం - స్వచ్చభారత్ ను సాధిద్దాం -వి. కృష్ణవేణి


ప్లాస్టిక్ భూతం.

మనం మారదాం - స్వచ్చభారత్ ను సాధిద్దాం. 
                                               --వి. కృష్ణవేణి.


నిత్య జీవితంలో మానవుడు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ..
ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తూ..
దానిలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచుకుంటూ..
నిత్యవసరాలలో అదొకభాగమై జీవితాన్ని,
వాతావరణాన్ని నిర్లక్ష్యధోరణిలోకి నెట్టివేసుకుంటూ..
ప్రమాదకర పరిస్థితులను కొనితెచ్చుకోవడమే కాకుండాప్లాస్టిక్ వ్యర్థపదార్దాలను నింపుతూ 
 వాతావరణాన్ని కలుషితం చేయడమేకాక..
మూగ జీవాలకు  సైతం హానికల్గిస్తూ..
విపరీత  దుర్బలపరిస్థితులలో బ్రతుకుతూ కాలం వెళ్ళబుచ్చుతూ..
ప్రకృతి వైపరీత్యాలనుతట్టుకుని జీవిస్తున్నాడే తప్పా జీవనవిధానాన్ని అలవాట్లను
మార్చుకోలేకపోతున్నాడు.

ఇలా మానవతప్పిదం వల్ల ఏర్పడిన
ప్లాస్టిక్ వ్యర్దాలు..
 భూమిలో ఎన్నో సంవత్సరాలుగా నిలువవుండి,
 ప్రాణాంతకంగా మారి వ్యాధికారకాలుగా మారుతున్న
 ప్రాణాంతకమైన పరిస్థితి నుండి రక్షించుకోవడానికి..
ఇకనైనా మారదాం ప్లాస్టిక్ భూతాన్ని
తరిమికొడదాం..
స్వచ్చభారత్ ని సాధించి..
ప్లాస్టిక్ బదులు కాగితపుసంచులను..
గుడ్డసంచులనే వాడుకుంటూ ..
ఇవే నిత్యవసరాలలో ఆరోగ్యసంరక్షణి అంటూ..
ప్లాస్టిక్ వాడకపోవడమే మనబాధ్యత అని  గుర్తించుకుంటూ..
సురక్షణమైన వాతావరణాన్ని సృష్టించుకుందాం..
పర్యావరణాన్ని కలుషితం నుండి రక్షించుకుందాం..
నూతనపద్ధతులు..
నూతన అభివృద్ధి  మార్గాలను..
 అనుసరించడమే కాదు ఆరోగ్యం కూడా ఎంతో అవసరమని తెలుకుందాం.


వి. కృష్ణవేణి.
వాడపాలెం.
9030226222

ప్రక్రియ :వచనం.
 

0/Post a Comment/Comments