ఓ ప్రేమికుడి ఆవేదన (కవిత)
------------₹₹₹₹₹------------------
నా కనులకు నీవు నచ్చావు
నీవనుకొని నేనిక వచ్చాను
ఇక్కడ అక్కడ ఎక్కడ లేవు
మరి నీవిక ఏమైపోయావు. !
చెప్పకుండా చేయకుండా వెళ్ళావే
తప్పకుండా నాకై నీవిక ఉండాలే
నీవు లేని ఈ జీవితమే ఇక దండగ
నీ వుంటేనే కదా మనకిక పండగ. !
నువ్వు నవ్వితే రాలును నవరత్నాలు
ఏరుటకై నేచేస్తాలే పలు
యత్నాలు
లే నవ్వితే పడిపోవునులే పగడాలు
ఇద్దరి మధ్యన ఇక ఉండవులే జగడాలు !
నీవు లేక ఇల్లంతా చిన్నబోయి ఉన్నది
నీ రాకకై ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నది
ఎందుకు వేసావే నీవు నాకు శిక్ష
ముందుకు నేపోలేక ఏమిటి నీ పరీక్ష !
ఇంట్లో దీపాలను వెలిగించే వాడే లేడు
కంట్లో కనుపాపల కరుణించే తీరు చూడు
నీవు లేక బతుకంతా ఆయెనుగా శూన్యం
నీ వస్తేనే తొలగిపోవు నా మదిలోన ధైన్యం
తోటలోని మొక్కలన్ని ఎండి పోవుచున్నవి
మాటరాక అవి నాతో
చెప్పలేకపోతున్నవి
పూచిన పూలన్ని నేలపాలు అవుతున్నవి
కాచిన కాయలన్ని కసుగాయలౌవుతున్నవి !
తప్పకుండా నీవికవస్తే ఏలుకుంట
చెప్పకుండా వెళ్లకుంటే కోలుకుంట
నా చంద్రముఖి నీవే నంట నేనీతోనే ఉంట
మన కాపురానికి ఏలాంటి ముప్పే ఇక రాదంట !
నీ పిలుపే ఇక నాకు వినబడదాయె
నీ రూపం నా కనులకు కనబడదాయె
ఓ సఖి! నా ప్రియమైన నా చంద్రముఖి
నా చెలీ! ఏది నీ చిరునామా లోగిలి!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.