గ్రామ పిల్లలం-సంగ్రామ మల్లెలం.
----------₹₹₹₹₹------₹₹₹₹₹----------
పాలుగారు బుగ్గలున్న పిల్లలం
తేనేలూరు మొగ్గలున్న మల్లెలం
విలేజ్ లో నివసిస్తున్న వారలం
కాలేజతో పనిచేస్తున్న పోరలం !
గ్రామ కూడలి లో అందరం కలుస్తాం
గ్రామవాడల పెద్దలను పిలుస్తాం
గ్రామ సమస్యలను మేం చర్చిస్తాం
గ్రామ పెద్దల సలహాలను హర్షిస్తాం
విలేజ్ లోని సమస్యలను వింటం
కవరేజ్,తో పరిష్కరించుకుంటం
గ్రామస్తుల చెలిమే మాబలమంటం
గ్రామాస్తుల కలిమేమేం కోరుకుంటం
బ్యాంకు లేని లోపాల గమనించి
బ్యాంకు లోను షరతుల వివరించి
గ్రామ రైతుల్లో కల్గిస్తాం చైతన్యం
గ్రామ ఆస్తుల్లో వెల్గిస్తాం నైపుణ్యం
గ్రామ పెద్దలను కలుసుకుంటాం
అవసరాలు అన్ని తెలుసుకుంటాం
వారిచ్చిన సలహాలను స్వీకరిస్తాం
ఆ ప్రకారంగా పనుల పరిష్కరిస్తాం
చదువు సంధ్యలను అందించే బడి
భక్తి శ్రద్దలను పెంపొందించే ఓ గుడి
ఈ రెండింటిని కట్టిస్తాం మేంనిలబడి
అప్పుడు ఉండదు గ్రామంలో ఏ అలజడి !
మా పల్లెప్రజలంటే మాకెంతో ప్రేమ
వారివల్లే కలుగు మా గుండెల్లో ధీమా
మా పక్కన వారుంటే దేన్నైనా సాధిస్తాం
మేం గ్రక్కున అమలుకై ఎవరితోనైనా సాధిస్తాం!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.