కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

ఒకటే కల...ఒకటే ఆశ...

జీవితం
ఒక కోర్కెల కొలిమి...
బ్రతుకు
ఒక ఆశల అలజడి...

ఔను పరిగెత్తే
ప్రతి నదికి...ఒకటే కల...
కడలిని చేరాలని
ఎగిసి పడే
ప్రతి అలకు...ఒకటే ఆశ...
తీరాన్ని దాటాలని

నవ్వే
ప్రతి మనిషికి...ఒకటే కల...
ఆరోగ్యంగా ఉండాలని
త్రవ్వే
ప్రతి మనిషికి...ఒకటే ఆశ...
తన దాహం తప్పక తీరాలని

విత్తనాలు నాటే
ప్రతి రైతుకు...ఒకటే కల...
పచ్చని పంటలు పండాలని
ఇంటికి ధాన్యం చేరాలని
విశ్రమించక శ్రమించే
ప్రతి విద్యార్థికి...ఒకటే ఆశ...
విజయాన్ని సాధించాలని
విశ్వ విజేతగా నిలవాలని

వెతికే
ప్రతి మనిషికి...ఒకటే కల...
నిధి నిక్షేపాలు దొరకాలని
తట్టే
ప్రతి మనిషికి...ఒకటే ఆశ...
తలుపులన్నీ తెరుచుకోవాలని

పుట్టిన
ప్రతి జీవికి...ఒకటే కల...
నిండు నూరేళ్ళు జీవించాలని
అర్థాంతరంగా అస్తమించరాదని
అస్తమించే
ప్రతి మనిషికి...ఒకటే ఆశ...
పునర్జన్మ అంటూ ఉంటే
మళ్ళీ మనిషిగానే జన్మించాలని

పరుగుపందెంలో పాల్గొనే
ప్రతి ఆటగాడికి...ఒకటే కల...
కప్పు గెలవాలని
అందరి మెప్పు పొందాలని
అవిశ్రాంతంగా పోరాడే
ప్రతి వీరుడికి...ఒకటే ఆశ...
అనుకున్న లక్ష్యాన్ని చేరాలని
అఖండ విజయం సాధించాలని

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502 

0/Post a Comment/Comments