సంకల్ప మెరుపులు
నీలి సాగరంలోని ఆకర్షకముత్యం లాంటి ప్రేమ
రసాకర్షణ క్షేత్రంలో విరగకాసిన జీవన శాఖికా పుష్పంలాంటి
ప్రణయం
నిరంతర తపనతో విరించిలా మారిన జ్ఞానదీపంలా
రచించటానికి కారణం
ఏదో ఒక ఆకృతితో దేదీప్యకళికలావెలిగే
పరమాత్మ సంకల్పాలు మెరుపులుగా నా మేధస్సుపై పడి
ఉరిమితేనే
ఈ అమర భాంఢాలు వర్షిస్తున్నాయి
నా ఎద నదిగా మారి ఉరకలేస్తూ సాగుతుంది
నా భావ అక్షరాలు కవితా సరస్సుగా మారుతున్నాయి
రచన
డా|| బాలాజీ దీక్షితులు పి.వి
తిరుపతి
8885391722