అందం అందం
--------------------------------
మిలమిల తారలు
మింటికి అందం
ముద్దుల పిల్లలు
ఇంటికి అందం
కిలకిల నగవులు
మోముకు అందం
నైతిక విలువలు
మనిషికి అందం
విరిసిన కలువలు
కొలనుకు అందం
కురిసిన చినుకులు
పుడమికి అందం
జ్యోతులు వనితలు
గృహముకు అందం
పూవుల సొగసులు
తోటకు అందం
పచ్చని మొలకలు
ఎంతో అందం
చదివే బాలలు
బడికే అందం
బుడిబుడి నడకలు
చాలా అందం
పిల్లల మాటలు
నిజముగ అందం
--గద్వాల సోమన్న