ప్రస్తుత పరిస్థితే నిదర్శనం - దొడ్డపనేని శ్రీ విద్య

ప్రస్తుత పరిస్థితే నిదర్శనం - దొడ్డపనేని శ్రీ విద్య

*ప్రస్తుత పరిస్థితే నిదర్శనం*

ప్రస్తుత పరిస్థితుల్లో
సమాజంలో ఎక్కడ చూసినా
భయానక వాతావరణమే

వాతావరణం అల్లకల్లోలం
వరద ముంపుతో భయానకం
జీవితం అతి దుర్బరం

కాలుష్యం తో రుతుపవనాలు దూరం
మానవ జీవనం అతలాకుతలం
ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం
పిల్లలు పెద్దల పరిస్థితి భయానకం

తినే తిండి లేక....
ఉండే గూడు లేక...
ప్రక్క వారిని దోచుకునే వారి నుంచి
తమను తాము కాపాడుకుంటూ

మానవత్వం మరిచిన లోకంలో
బ్రతుకు తెరువు కోసం ఎదురు చూస్తూ

సహాయక చర్యలు లో భాగంగా
అందరికీ సాయం చేయడం

కక్షలు కార్పణ్యాలతో దురాచారం
ఒకరి పై ఇంకొకరికి ద్వేషం
నోరు  జారితే భయం 
సాయం చేద్దామంటే భయం
ప్రయాణం ఓ భయం
రాజకీయ ప్రయోజనాలతో
నేతల్లో భయం

ఎటువైపు చూసినా
భయానిక వాతావరణం
నేటి సమాజ దుస్థితే
ఓ భయానకం
జీవనం అతి భయానకం

✒️✒️✒️✒️✒️✒️✒️

*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
03/12/2021

0/Post a Comment/Comments