"మేలు చేసే నీరు"-గద్వాల సోమన్న

"మేలు చేసే నీరు"-గద్వాల సోమన్న

"మేలు చేసే నీరు"
------------------------------
అదుపు గల్గిన నోరు
కలుగజేయును పేరు
ప్రేమ పూలను రువ్వి
అందరి మేలు కోరు

ముద్దులొలికే పైరు
మంచి చేసే యేరు
అబద్ధాలు జయించి
నిజం పలికే నోరు

వదరుబోతుల నోరు
తెచ్చిపెట్టును పోరు
కర్ణ కఠోరమైన
వట్టి సంద్రపు హోరు

గొప్ప వ్యక్తుల నోరు
వర్ణ శోభిత తేరు
జీవ నదిలా సదా
ప్రేమ ధారలు పారు

--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments