జరుగుమల్లి.వీరయ్య

జరుగుమల్లి.వీరయ్య

ప్రవాహిణి వెబ్ పత్రిక ప్రచురణ కొరకు
శీర్షిక : సదుం వినాయక విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
రచయిత : జరుగుమల్లి వీరయ్య కలికిరి  8106974626

ముందస్తుగా "సంక్రాంతి" సంబరాలు

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోగల
ప్రముఖ శ్రీ వినాయక విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీమతి సుగుణ మరియు శ్రీ రమణా రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీమతి సుగుణ మాట్లాడుతూ.. తెలుగువారి సంప్రదాయానికి ప్రతీక..
సుఖసంతోషాల గీతిక..
తెలుగు లోగిళ్ళకు తొలి కాంతి..
తెలుగు వెలుగుల కాంతి..
మూడు దినముల సంబరాల సంక్రాంతి పండుగ.
సిరులొలికే సంక్రాంతి,ధాన్య రాసులతో  గాదెల నిండగా,ప్రతి ఇంటి ముంగిట కల్లాపి జల్లి,రంగు రంగుల హరివిల్లులా.. ముగ్గులు కనివిందు చేయగా,ముగ్గులలో నవధాన్యాల తో
గుమ్మడి తంగేడు బంతి పూలతో
ముస్తాబై,గొబ్బెమ్మల మేరవ గా, గొబ్బెమ్మల చుట్టూ సంక్రాంతి పాటలు పాడి, సంతోషంగా జరుపుకునే సంబరాల సంక్రాంతి పండుగ అని శ్రీమతి సుగుణా గారు అన్నారు. అనంతరం శ్రీ రమణా రెడ్డి గారు మాట్లాడుతూ.. సూర్యుడు మకర సంక్రమణ ఆగమనం, అంబరాన్నంటే సంక్రాంతి పండుగ సంబరం, అంబరాన పతంగుల విహారం, తెలుగు జాతి యావత్తు జరుపుకునే  భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇలా ముచ్చటగా మూడు రోజుల పండుగ సంక్రాంతి పండుగ. వేకువనే ఇంటి ముంగిట మంటలు వేసుకుని, సమస్యలను పారద్రోలి, ఉషస్సును జీవితంలోకి ఆహ్వానించే పండుగే భోగి పండుగ. జగము వెలుగు సూర్యుడు మకర రాశిలోకి వచ్చి, శుభమును జనులందరికీ ప్రసాదించి, క్రాంతి అందరకు ఇచ్చే సంక్రాంతి పండుగ.
కొత్తకుండ పొంగళ్ళు అలరారించే షడ్రుచుల  సంక్రాంతి పండుగ.
మానవజాతి మనుగడకు అవసరమని జెప్పే పశువుల ప్రాధాన్యతను తెలియ జేసేదే కనుమ పండుగ అని ఈ విధంగా సంక్రాంతి పండుగ విశిష్టతను శ్రీ రమణా రెడ్డి గారు తెలియజేశారు. తదనంతరం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని విభిన్న ప్రక్రియలలో పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు పంపిణీ చేయడం జరిగిందని భరత్ రెడ్డి గారు అన్నారు. తదనంతరం విద్యార్థులు ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

0/Post a Comment/Comments