మన ఆత్మభవుడు శివుడే !(కవిత)
-----------₹₹₹₹₹₹-----------------------
కణం కణంలోను ఉన్నాడు శివుడు
గణం గణంను ఆకొన్న ఆ దేవుడు
అణు అణువులోన దాగి ఉన్నాడు
తనువులోనూ తా వెల్గుతున్నాడు !
సర్వ జీవులలో సజీవుడు శివుడు
పంచకర్మల నిర్వహించు చున్నాడు
చరముల అచరముల అఖండుడు
ఆనందతాండవం ఆడు ప్రకండుడు
శివుడు లేని జీవియే లేదు ఇలలో
భవుడు లేని భాగ్యంలేదు కలలో
ముక్కంటి లేని ముల్లోకాలు లేవు
తెలుసుకుంటే తప్పలేవు నీతావు !
బాహ్యంగా జగత్తును ఆక్రమించాడు
అంతర్లీనంగా అంతట విశ్రమించాడు
సర్వజీవుల పరంధాముడై ఉన్నాడు
పంచకర్మల పల్గునుడై పవళించి ఉన్నోడు!
సూర్యునిలా వెలుగుతున్న వాడు శివుడే
చండ ప్రచండం వెలుగుల రేడు ఈ
భవుడే
శివుడికి శివుడే సాటి ఆయనే మన ఘనాపాటి
చరాచర జగత్తులో ఆభవుడికి లేరెవ్వరు సాటి !
అమృత కిరణాలు వెదజల్లే వేదమూర్తి
పుష్టిని సంతుష్టిని కలిగించే రసం చక్రవర్తి
జీవుడై జినుడై జగత్తునేలు జితేంద్రుడు
సర్వం శివమయంయైన లయకారుడు !
భీముడు అనే మూర్తి రూపకర్త
ఇనుడనే రూపస్వరూప సృష్టికర్త
పశుపతియైన సంజీవిని రసకర్త
శివుడే ఈశానుడై వెల్గె శ్రీవేదకర్త !
మూర్తి రూపంకల్గిన రుద్రమూర్తి
ఆర్తి స్వరూపం గల్గిన ఉగ్రమూర్తి
లేడు రాడు అనువాడు కానేకాడు
సర్వాంతర్యామి అయిన కాలుడు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.