" పాద రక్షలు "--గద్వాల సోమన్న

" పాద రక్షలు "--గద్వాల సోమన్న

" పాద రక్షలు "
-----------------------------------
చెప్పులండి చెప్పులు
పాదాలకు స్నేహితులు
మానవులకు సేవకులు
కాపాడే రక్షకులు

రకరకాల చెప్పులు
రమ్యమైన చెప్పులు
నీడలా నడిచి వచ్చు
ఓడలా హాయినిచ్చు

తల్లిలా ఆదరించు
ఎల్లరిని అలరించు
చల్లని మనసు గలవి
చెప్పులంటే గొప్పవి

ముద్దుముద్దు చెప్పులు
అందరికీ ఇష్టులు
తిరిగి తిరిగి సేవ చేయు
తరిగి తరిగి మేలు చేయు
--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments