నేడుమహాలయ అమావాస్య
భాద్రపద మాసంలోవచ్చేఅమా వాస్య,ఆశ్వయుజఅమావాస్యలు చెప్పుకోదగినవి. భాద్రపద అమావాస్యను ''మహాలయ అమావాస్య'' అని,పెత్రమత్స్య
ఆషాడ పూర్ణిమ ఓ మొదలు అయ బహుళ పాడ్యమి నుం డి అమావాస్య వరకు మహాల య పక్షము''లంటారు. చివర గా వచ్చే అమావాస్యను'మహా లయ అమావాస్య' అంటారు. ఈ పక్షములో పితరులు అన్నా న్ని, ప్రతిరోజూ జలమునుకోరు తారు. తండ్రి చనిపోయిన రో జున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధా వి ధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృదేవతలంతా సంవత్స ర మంతాతృప్తిచెందుతారు,తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వా రు ఉత్తమ గతిని పొందు తా రు. ఈ విషయాలన్నీ నిర్ణయ సింధువు, నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షముమహాన్ అలయః, మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.
అమావాస్యఅంతరార్థం'అమా' అంటే ''దానితోపాటు'', 'వాస్య' అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడి తోపాటు వసించే రోజు కాబట్టి 'అమావాస్య'అన్నారు.సూర్యుడు స్వయం చైతన్యం. చంద్రు డు జీవుడే. మనస్సుకు అధిప తి. అదే చంద్రుని ఉపాధి.మన స్సుపరమచైతన్యంలోలయమై తే, జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది. అదేనిజ మైన అమావాస్య. చంద్రమం డలం ఉపరితలం మీద నివ సిం చే పితృదేవతలకు, అమా వాస్య తిధి మిట్టమధ్యాహ్నమ వుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున పితృదేవ తలు పుత్రులిచ్చే తర్పణము లకు ఎదురు చూస్తూ ఉంటా రని ధర్మగ్రంథాలు తెలుపు తున్నాయి.మత్స్యపురాణగాథపితృదేవతలు ఏడు గణము లుగా ఉన్నారు. వారి మానవ పుత్రికఅచ్ఛోద''.పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టా రు. ఆ అచ్ఛోద, సరస్సు తీరం లో తపస్సు చేసింది. పితృ దే వతలు సంతుష్టులై ప్రత్యక్ష మ య్యారు.వరముకోరుకోమన్నా రు. ఆమె వారిలో ''మావసు'' డను పితరుని కామ పరవశం తో వరునిగా కోరింది. యోగ భష్ట్రురాలయింది. దేవత్వంపో యి, భూమి మీదకొచ్చింది.మా వసుడు, అచ్చోదను కామిం చలేదు.కనుకఅచ్ఛోద''మావస్య'' అనగా ప్రియురాలు అధీనురాలు కాలేకపోయింది. కనుక. ''మావస్య'' కాని ఆమె ''అమావస్య'' లేక ''అమావా స్య'' అయింది. తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద, పితరులకు ప్రీతిపాత్రమ యిం ది. అందువలన, పితృదేవతల కు అమావాస్య తిథి యందు పితులకు అర్పించిన తర్పణా ది క్రియలు, అనంత ఫలప్ర ద ము,ముఖ్యంగాసంతానమునకు క్షేమము, అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది. జననీ జనకులను ప్రేమాను రా గాలను అందించి, మరణానం తరం కూడా వారికోసం యథా విధిగా నైమిత్తిక కర్మల నాచరిం చి, పితృతర్పణాదులనిస్తే, వా రి ఋణం తీర్చుకున్న వాళ్ల వుతారని, పితరుల ఆశీస్సు లతో వంశాభివృద్ధి జరుగు తుందని చెప్తోంది మహాలయ అమావాస్య.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
లింగాపూర్, కామారెడ్డి