గుర్రాల ముత్యాల హారాలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్.9491387977.

గుర్రాల ముత్యాల హారాలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్.9491387977.

గుర్రాల ముత్యాల హారాలు

381) మన వేద విజ్ఞానము
        తెలుసుకో ఈ దినము 
         అవుతుంది జీవనము
         ఇక పరమపావనము!

382) వారు పుణ్య దంపతులు
        చేస్తున్నారు వ్రతాలు
        వస్తున్నారు జనాలు
         ఇస్తున్నారు కానుకలు !

383) అమ్మలక్కలు వచ్చారు
        వారిని దీవించారు
        పూలు పండ్లను ఇచ్చారు
       అంతా వారిని మెచ్చారు

384) పిల్లలు ఆడుతున్నరు
         ఈలలు వేస్తున్నారు
         అల్లరి ఉందక్కడ
         మరిపోతావ్ ఎక్కడ ?

385) స్వామి భక్తిని పెంచుకో
          విధియని భావించుకో
          చెడును వదిలించుకో
          మంచిని నీవు ఎంచుకో

386) సంగీత శిక్షణ పొందు
         సప్తస్వరాల విందు
         ఆనందం ఉంది అందు
         ఎప్పుడు చేయకు బంద్ !

387)) రామ రాజ్యం వచ్చింది
         ఆనందాన్ని తెచ్చింది
          సంపదలను ఇచ్చింది
          మమ్ములను తెగ మెచ్చింది 

388) వర్ణమాల వ్రాయాలి
      తక్షణం చదవాలి
       చదివి నీవు ఎదగాలి
       మా పరువు నిలపాలి!

389) అమ్మవారిని తలుచుకో
         మదిలో స్మరించుకో
         భక్తిని నీవు పెంచుకో
         భక్తుడవనిపించుకో !

390) గంగా పవిత్రమైనది
        గలగల పారుతున్నది
         దివిపైకి చేరుతున్నది
         దీవెనలను ఇస్తున్నది !

391) రామ భజన చేయండి
         స్వామి పల్లకి మోయండి
          పూల మాలలు వేయండి
          ప్రసాదాలు పంచండి  !

392) వేదాలను చదవండి
         వాదాలు చేయకండి
         ఈనిజం తెలుసుకోండి
          తెలుసుకొని మసలుకోండి!

393) సీతాకళ్యాణం చూడు
          నీ కన్నులార నేడు
          అన్నుల మిన్నుల తోడు
           కలసి పాటలను పాడు !

394) దొంగలున్నారు బాబు
        భద్రం ఇక నీ  జేబు
         నీదేనా ఈ రికాబు
          అయితే నీవు గరీబు !

395) అదిగో శమీవృక్షం
        తీసి చూడు గవాక్షం
         వారేనా నీ పక్షం
          ఎవరు ఇందుకు సాక్ష్యం !

396) బందరు లడ్డు తీపి
        తీసుకో చేయిచాపి
         నీవు నీతలను ఊపి
          చేయకు వారిని కాపి !

397) అదిగో తిరుపతి లడ్డు
        చెప్పకు నీవిక అడ్డు
         చెపితే ఉందిగా తెడ్డు
         ఎక్కర నీవిక బెడ్డు !

398) పిల్లల మర్రిని చూడు
        ఊడలు పట్టుక ఆడు
        ఎవరు వచ్చారు తోడు
         వారే నిన్ను కాపాడు !

399) ఉయ్యాల ఊగుతుంది
         పాప ఏడుస్తూ ఉంది
         ఫ్యాను వేసే ఉంది
           మరి ఎందుకు ఏడుస్తుంది !

400) తేలు కుట్టిన దొంగ
         కారుస్తున్నాడు చొంగ
         జోగుతున్నాడు నిజంగ
        చెపితే వినవా రంగ. !

గుర్రాల లక్ష్మారెడ్డి., కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

         
         
          
         
         

          
  

         
       

        
.

0/Post a Comment/Comments