10th వ్యాకరణం - సమాసములు 1

10th వ్యాకరణం - సమాసములు 1

 సమాసములు



సమాసము: రెండుమూడు శబ్దములను ఏకపదముగా చేర్చడము. విభక్తి లోపము చేసిన పదము.

“సమర్థములగు పదముల యేకీభావము”, సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అంటారు.


అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తపదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు .

సమాసంలో ఉండే పదాల, అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు (పేర్లు) ఏర్పడ్డాయి.

వేరువేరు అర్థాలుగల రెండు పదాలు ఒకే పదం అగుటద్వారా సమాసం ఏర్పడుతుంది.

విగ్రహవాక్యం: సమాసానికి అర్థ వివరణనే విగ్రహవాక్యం అంటారు.


సమాసాలు శబ్దాన్నిబట్టి అర్థాన్ని బట్టి ఏర్పడుతాయి. అందులో కొన్ని:


ద్వంద్వ సమాసము

ద్విగు సమాసము

రూపక సమాసము

బహువ్రీహి సమాసము

తత్పురుష సమాసాలు:

కర్మదారాయ సమాసాలు:


ద్వంద్వ సమాసము:

“ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము”.

అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.


రెండుకాని అంతకన్న ఎక్కువగా సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు.


ఉదా:

  1. రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
  2. ఆలుమగలు - ఆలును, మగడును
  3. తల్లిదండ్రులు - తల్లియును, తండ్రియును
  4. జీవధనములు - జీవమును, ధనమును 
  5. భూతప్రేతములు - భూతమును, ప్రేతమును 
  6. శక్తియుక్తులు - శక్తియును, యుక్తియును
  7. అందచందములు - అందమును, చందమును


ద్విగు సమాసము:

“సంఖ్యాప్రధానం ద్విగువు”. 

సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.


పూర్వ పదం సంఖ్యా వాచకమైతే అది ద్విగువు.

పూర్వపదం అయితే తర్వాత పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయి ఉంటుంది.


ఉదా:

  1. మూడు లోకములు - మూడు అయిన లోకములు.
  2. త్రికరణాలు - త్రి (మూడు) సంఖ్యగల కరణాలు
  3. నవరసాలు - నవ (తొమ్మిది) సంఖ్యగల రసాలు`
  4. మూడడుగులు = మూడు సంఖ్య గల అడుగులు 
  5. దశదిక్కులు = దశ సంఖ్య గల దిక్కులు


రూపక సమాసం:

రూపక సమాసాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అనికూడా అంటారు.


అవధారణ: నిశ్చయించుట, నిశ్చయము, హద్దులో వుంచుట, ప్రతిబంధకము.


సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. “ఉపమానము యొక్క ధర్మాన్ని ఉపమేయముపై ఆరోపించడాన్ని రూపక సమాసం లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు”.


ఉపమాన ఉపమేయములకు అభేదం తెలపడం రూపకం.

అభేదం: భేదమున్నను భేదమున్ననూ భేదం లేనట్లు చెప్పడం.

ఉపమాన ఉపమేయములకు భేదమున్ననూ భేదం లేనట్లు చెప్పడం రూపకం.


ఉదా:

  1. విద్యా ధనము - విద్య అనేడి ధనము
  2. కాంతివార్ధులు = కాంతులు అనే వార్ధులు 
  3. మతపిశాచి = మతము అనే పిశాచి 



బహువ్రీహి సమాసము:

“అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి”. అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ దానికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.


అన్యము: ఇతరము, వేరొక.

సమాసములోని పదాల ద్వారా వచ్చే మరో పదము యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉన్నట్టయితే దానిని బహువ్రీహి సమాసం అంటారు.


ఉదా:

  1. చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు
  2. చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు 
  3. చతుర్ముఖుడు - నాలుగు ముఖములు కలవాడు 
  4. నీలవేణి - నీలమైన వేణి గలది 
  5. గరళకంఠుడు - గరళము కంఠమున గలవాడు
  6. దయాంతరంగుడు - దయతో కూడిన అంతరంగము కలవాడు
  7. ఆజానుబాహుడు ౼ జానువుల వరకు బాహువులు కలవాడు.
  8. ముక్కంటి ౼ మూడు కన్నులు కలవాడు.
  9. గరుడ వాహనుడు ౼ గరుడుడు వాహనముగా కలవాడు.
  10. చతుర్ముఖుడు ౼ నాలుగు ముఖాలు కలవాడు.
  11. పద్మాక్షి - పద్మం వంటి కన్నులు కలది.
  12. దశకంఠుడు = దశ సంఖ్య గల కంఠములు గలవాడు 
  13. పీతాంబరుడు = పసుపు పచ్చిని అంబరము కలవాడు 
  14. అరవిందానన = అరవిందము వంటి ఆననము కలది 
  15. మృగనేత్ర = మృగము వంటి నేత్రములు కలది చంచలాక్షి 
  16. మానధనులు = అభిమానమే ధనముగా గలవారు 
  17. రాజవదన = రాజు అనగా చంద్రుని వంటి వదనము గలది 
  18. నీరజభవుడు = నీరాజము అనగా పద్మము పుట్టుకగా గలవాడు


పై పదాలలో మొదటి పదానికి గాని రెండవ పదానికి గాని ప్రాధాన్యత లేదు. రెండు పదాలు మరో పదం యొక్క "అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉన్న సమాసాన్ని "బహువ్రీహి" సమాసం అంటారు.


ఉదా: 'చక్రపాణి' అనే సమాస పదంలో 'చక్రము' అనే పదానికి ప్రాధాన్యత లేదు. 'పాణి' (చేయి) అనే పదానికి కూడా ప్రాధాన్యత లేదు. చక్రము పాణియందు కలిగిన వానికి ప్రాధాన్యత ఉన్నది. ఇట్లా సమావేశంలో పదాల ద్వారా వచ్చే మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.


తత్పురుష సమాసాలు:

  1. ప్రథమా తత్పురుష సమాసము
  2. ద్వితీయా తత్పురుష సమాసము
  3. తృతీయా తత్పురుష సమాసము
  4. చతుర్థీ తత్పురుష సమాసము
  5. పంచమీ తత్పురుష సమాసము
  6. షష్ఠీ తత్పురుష సమాసము
  7. సప్తమీ తత్పురుష సమాసము
  8. నఞ్ తత్పురుష సమాసము


“ఉత్తర పదార్థ ప్రధానం తత్పురుషం”. సమాసంలోని రెండో పదం యొక్క అర్థం ప్రధానంగా గల సమాసం తత్పురుషం. తత్పురుష సమాసాలను వ్యవధికరణ సమాసాలంటారు.


వ్యవధికరణం: విభక్తులతో కూడిన పదాలకు మీదిపదం పదంతోడి సమాసాన్ని వ్యవధికరణం అంటారు.


విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలను చేర్చవలసి వస్తే మొదటి పదం చివర ఏ విభక్తి అనుకూలిస్తుందో ఆ విభక్తి పేరుతో ఈ సమాసాన్ని పిలుస్తారు. పూర్వపదం చివరవుండే విభక్తిని బట్టి ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తిస్తారు.

 

విభక్తులు

విభక్తులను కారకాలని కూడా అంటారు. 

అంటే క్రియతో అన్వయం పొందేవి లేదా అన్వయం కలిగించేవి అని అర్థం. 

తెలుగులోని విభక్తులన్నింటికీ క్రియతో సంబంధం ఉంటుంది. ఇవి పొడి అక్షరాల రూపంలోనూ, పదాల రూపంలోనూ ఉంటాయి. వీటికి చాలా వరకు ప్రత్యేకంగా అర్థముండదు. వీని నామ విభక్తులని కూడా అంటారు. ప్రత్యయాలని మరోపేరు.


ప్రత్యాలు - విభక్తులు

 డు, ము, వులు - ప్రథమా విభక్తి

నిన్, నున్, లన్, గూర్చి, గురించి - ద్వితీయా విభక్తి

చేతన్, చేన్, తోడన్, తోన్ - తృతీయా విభక్తి

కొఱకున్ (కొరకు), కై - చతుర్ధీ విభక్తి

వలనన్, కంటెన్, పట్టి - పంచమీ విభక్తి

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ - షష్ఠీ విభక్తి

అందున్, నన్ - సప్తమీ విభక్తి

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ - సంబోధనా ప్రథమా విభక్తి

 

* పై విభక్తి ప్రత్యయాలు కొన్ని నకారాన్ని కలిగి ఉన్నాయి. నకారం లేకుండా కూడా ఉండవచ్చు.

ఉదాహరణకు:


ప్రథమా తత్పురుష సమాసం

  1. అర్ధరాత్రి - రాత్రి యొక్క అర్ధభాగము 
  2. మధ్యాహ్నం - అహ్నం మధ్యభాగం 


ద్వితీయా తత్పురుష సమాసం

  1. నెలతాల్పు - నెలను తాల్చినవాడు
  2. జలధరము - జలమును ధరించునది


తృతీయా తత్పురుష సమాసం

  1. వయోవృద్ధులు - వయస్సు చేత వృద్ధులు 
  2. కనకాభిషేకము - కనకముతో అభిషేకము 


చతుర్థీ తత్పురుష సమాసం

  1. ఊతపదాలు - ఊతం కొరకు పదాలు 
  2. బ్రతుకు త్రోవ - బ్రతుకు కొరకు త్రోవ 
  3. సంక్షేమపథకాలు - సంక్షేమం కొరకు పథకాలు 


పంచమీ తత్పురుష సమాసం

  1. దొంగభయము - దొంగ వలన భయము
  2. స్వర్గపతితుడు - స్వర్గము నుండి పతితుడు


షష్ఠీ తత్పురుష సమాసము

  1. కాకతీయుల కంచుగంట - కాకతీయుల కంచుగంట 
  2. ఎడారి దిబ్బలు - ఎడారిలో దిబ్బలు 
  3. గుండె ఇసుకలు - ఇసుక యొక్క గుండెలు 
  4. యయాతిచరిత్ర - యయాతి యొక్క చరిత్ర
  5. పుష్పగుచ్ఛము - పుష్పముల యొక్క గుచ్ఛము
  6. వేదాంగాలు - వేదాల యొక్క అంగాలు 
  7. సముద్రతీరము - సముద్రము యొక్క తీరము


సప్తమీ తత్పురుష సమాసము

  1. బ్రాహ్మణభక్తి - బ్రాహ్మణుల యందు భక్తి
  2. కుటీరపరిశ్రమ - కుటీరము లోని పరిశ్రమ
  3. కంటినీరు - కంటి యందలి నీరు


నఞ్ తత్పురుష సమాసము:

నఞ్ అంటే వ్యతిరేకార్థం.

అబావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగుణపుడు న-'అ' గా మారును. అచ్చు పరమగుణపుడు 'అన్' గా మారును.

వ్యతిరేకార్థాన్ని బోధించు న ప్రత్యయం మొదలుగాగల సమాసాలకు నఞ్ తత్పురుష సమాసాలని పేరు.


ఉదా:

  1. న + ఉచితము - అనుచితము - ఉచితము కానిది
  2. అనంతం - అంతం లేనిది 
  3. అసాధ్యము - సాధ్యము కానిది 


కర్మధారయ సమాసాలు

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము 

విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము

సంభావనా ​​పూర్వపద కర్మధారయ సమాసము


కర్మధారయము: శేషణమునకు విశేష్యము తోడి సమాసము.

విశేషణ విశేష్యాలతో వచ్చిన పదాలను కర్మధారయాలు అంటారు.

కర్మధారయ సమాసాలను సమానాధికరణ సమాసాలు అనికూడా అంటారు.

సమానాధికరణం: విశేషణానికి విశేష్యం తోడి సమాసమైతే సమాసమైతే సమానాధికరణం అంటారు.

విశేష్యం: విశేష్యం అనగా నామవాచకం.

 

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము:

“సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేషముగాను ఉంటే దానిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు”.


ఉదా: మధుర వచనము - మధురమైన వచనము

చిరునవ్వు - చిన్నదైన నవ్వు

నల్లకలువ - నల్లనయిన కలువ

పుట్టినిల్లు - పుట్టినట్టి ఇల్లు

పెనుతుఫాను - పెద్దదైన తుఫాను

కల్యాణ ఘంటలు - కళ్యాణ ప్రదమైన ఘంటలు 

మహారవము - గొప్పదైన రవము 

వికారదంష్ట్రలు - వికారమైన దంష్ట్రలు 

బృహత్కార్యం - బృహత్తు అయిన కార్యం 

 

విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము:

“సమాసము లోని పూర్వపదము విశేషముగాను, ఉత్తరపదము విశేషణము ఉంటె దానిని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అంటారు”.

ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము

 

సంభావనా ​​పూర్వపద కర్మధారయ సమాసము:

సంభావనము: సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి.

“సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో దానిని సంభావనా ​​పూర్వపద కర్మధారయ సమాసము అంటారు”.

సంజ్ఞనే సంభావన అంటారు. సమాసములోని పూర్వపదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అంటారు.


ఉదా: ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.

తెలుగుభాష - తెలుగు అను పేరుగల భాష

గంగానది - గంగ అను పేరుగల నది. 

తెలంగాణ రాష్ట్రం - తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం గోలకొండ పట్టణము - గోలకొండ అనే పేరుగల పట్టణం


Readable pdf



Download pdf 




0/Post a Comment/Comments