పద్య పారిజాతాలు(ఆట వెలది పద్యాలు) --గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

పద్య పారిజాతాలు(ఆట వెలది పద్యాలు) --గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

పద్య పారిజాతాలు
(ఆట వెలది పద్యాలు)
---------------------------------------

పరుల హితము కోరు పరమాత్మలు భువిలో
వారి కన్న ఘనులు వసుధ లేరు
సేవ జేసి జనుల క్షేమమ్మునొందుము
సోమ నాఖ్యుమాట సొంపులమరు

ధన్యత మహిలోన తల్లిదండ్రుల మాట
వినిన జీవితాన విందుజేయు
నడత చెడిన దిద్దు నవత కలుగజేయు
సోమ నాఖ్యుమాట సొంపులమరు

పాడు బుద్ధి యున్న పతనమగు బ్రతుకు
నాదిలోన దాని నదిమి పెట్టు
పెరిగి పెద్దదైన  పెకలింప  కష్టము
సోమ నాఖ్యుమాట సొంపులమరు

ఉన్న వృత్తిలోన నుదయించు భానుడు
చక్కజేసి బ్రతుకు సాయపడును
ధరణి యందు గురువు దారిచూపినెడుపు
సోమ నాఖ్యుమాట సొంపులమరు

గురువు పాత్ర ఘనము గుర్తుపెట్టుకొనుము
మకిలి పనులు చేసి మచ్చయే ల?
కొలువుదీరు మదిని విలువైన  గురువర్య
సోమ నాఖ్యుమాట సొంపులమరు

గురువు బ్రహ్మ  భువిని నెరుగు వారి విలువ
మహిని పూజజేసి  మదిని నిలుపు
జ్ఞాన దాత నతడు జాబిలి వెన్నెల
సోమనాఖ్యుమాట సొంపులమరు

బ్రహ్మ రూపమతడు బ్రతుకులోన వెలుగు
మేటియైనయతడి సాటిలేరు
శిరము వంచి నెదుట కరములు జోడించు
సోమ నాఖ్యుమాట సొంపులమరు

నీతి బోధ చేసి ఖ్యాతి చేకూర్చును
వెలుగునొసగు దివ్వె  వెన్న మనసు
తండ్రి ప్రేమ జూపు త్యాగమూర్తి గురువు
సోమ నాఖ్యుమాట సొంపులమరు

బుద్ధి చెప్పువాడు గద్దించును గురువు
గొప్పవాడు నతడు గొనము ఘనము
దిద్దుబాటు నేర్పి శుద్ధిచేయు నడత
సోమ నాఖ్యుమాట సొంపులమరు

కనుల నెదుట గురువు కనిపించే దైవము
సౌఖ్యమొసగువారు సఖ్యతగను
పుణ్యము దొరుకునిల పూజనీయులు కదా!
సోమ నాఖ్యుమాట సొంపులమరు

శ్రేష్ఠమైన వృత్తి శ్రేయస్సు నిచ్చును
ఘనత కలుగజేయు మనసు మురియు
గురువు వృత్తి గొప్ప పరువు బ్రతుకులోన
సోమ నాఖ్యుమాట సొంపులమరు

--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments